బండి సంజయ్ పై అధిష్ఠానానికి నేతల ఫిర్యాదులు..?ఎందుకంటే?

రెండో దఫా సార్వత్రిక ఎన్నికల కంటే ముందు తెలంగాణలో బలంగా ఉన్న పార్టీలు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి.అయితే ఎన్నికలు జరిగిన అనంతరం రెండో సంవత్సరంలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది.

 Leaders Complaints Against Bandi Sanjay ..?, Bandi Sanjay, Bjp Leaders-TeluguStop.com

అప్పటివరకు తెలంగాణలో బీజేపీకి అసలు పట్టు అనేది కాని పటిష్టమైన క్యాడర్ కాని లేదు.అయితే చాప క్రింది నీరులా బీజేపీ వ్యాపించి ఒక్కసారిగా దుబ్బాక ఎన్నికలో ఒక్కసారిగా పుంజుకొని అధికార పార్టీని ఏ విధంగా దెబ్బ తీసిందో మనం చూసాం.

అయితే బీజేపీ బండి సంజయ్ అధ్యక్షులుగా అయిన తరువాత మాత్రమే కొంతమేర పుంజుకొని కార్యకర్తలలో ఉత్సాహం కలిగించాడని చెప్పుకోవచ్చు.

అయితే ఏ పార్టీలోనైనా కలహాలు సహజం.

కాని అవి అంతర్గతంగా పరిష్కరించుకోవాలి కాని బయట పడేలా ఉండకూడదు.అది మిగతా పార్టీల వారికి ఆయుధంగా మారుతుంది.

ఇప్పుడు ఖచ్చితంగా ఇట్లాగే జరుగుతోంది.బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే తన పార్టీ నేతలు తనకు సమాచారం ఇవ్వకుండా మంత్రి కేటీఆర్ ను కలవడం పట్ల బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.

అయితే బండి సంజయ్ వ్యవహార శైలి పట్ల మంత్రి కేటీఆర్ ను కలిసిన నాయకులు బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిస్తోంది.ఇప్పటివరకు ఏ నిర్ణయాల్లో మా అభిప్రాయం అడగలేదని, మేము పార్టీ మేలు కొరకే కేటీఆర్ ను కలిశామని దానికి బండి సంజయ్ వ్యవహరించిన తీరు తమను బాధించిందని వారి అధిష్టానం దగ్గర వ్యాఖ్యానించినట్టు సమాచారం.

మరి బీజేపీలో ఈ గొడవ ఎంత వరకు వెళ్తుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube