పెను దుమారం సృష్టిస్తున్న కమల్ వ్యాఖ్యలు... నాలుక కోయాలి అంటూ తీవ్రంగా స్పందించిన నేత

ఎం ఎం ఎం పార్టీ అధినేత,గ్లోబల్ స్టార్ కమల్ హాసన్ హిందువుల పై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం సృష్టిస్తున్నాయి.స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ఉగ్రవాది హిందువే నంటూ నాధూరాం గాడ్సే ని ఉద్దేశిస్తూ కమల్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

 Leaders Are Angry About Kamal Comments-TeluguStop.com

అయితే ఈ వ్యాఖ్యలపై అటు హిందుత్వ పార్టీ లే,తమిళనాడు ప్రతిపక్ష పార్టీలు, పలువురు సినీ ప్రముఖులు కూడా నిప్పులు చెరుగుతున్నారు.ఈ క్రమంలో ఆయనకు మద్దతుగా తమిళ కాంగ్రెస్ పార్గీ నిలుస్తోంది.

తమిళనాడు బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూంటే అక్కడి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మాత్రం కమల్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.కమల్ చేసిన వ్యాఖ్యలు 1000 శాతం నిజమేనని వ్యాఖ్యానించారు.

అయితే తమిళనాడు మంత్రి రాజేంద్ర బాలజీ మాత్రం కమల్ నాలుక కోయాలి అంటూ తీవ్రంగా స్పందించారు.ఒక వ్యక్తి కారణంగా మొత్తం మతాన్ని నిందించలేమంటూ రాజేంద్ర బాలాజీ అన్నారు.

కమల్ వ్యాఖ్యల పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

ఆయన గాంధికి వారసుడు కాదని జిన్నాకు వారసుదంటూ వారు మండిపడ్డారు.

ఈనేపథ్యంలోనే జిన్నా పాకిస్థాన్ నుండి హిందువుల శవాలను వేలాదిగా రైళ్లలో వేసి పంపించిన ఘటన గుర్తుకు లేదా అంటూ కమల్ పై ఫైర్ అయ్యారు.ఈ క్రమంలో ఆయనపై 5 రోజులపాటు వేటు వేయాలని కోరుతూ ఎన్నికల కమీషన్ కు పిర్యాధు చేసినట్లు తెలుస్తుంది.

మరోపక్క కమలహాసన్ చేసిన వ్యాఖ్యలను సినీ రంగానికి చెందిన వివేక్ ఒబేరాయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ ద్వారా ఖండించారు.కమల్ ఒక నటుడు, కళలకు మతంతో సంబంధం లేనట్లుగానే ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేదు,ఈనేపథ్యంలోనే గాడ్సే ఓ తీవ్రవాది అని చెప్పారు కాని హిందు అనే పదం ప్రత్యేకంగా ఎందుకు వాడారంటూ ప్రశ్నించారు.

ముస్లింల ఓట్లు రాబట్టుకోవడం కోసం ఇలాంటీ వ్యాఖ్యలు చేశారా అంటూ వివేక్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube