రానాతో లీడర్ సీక్వెల్.. శేఖర్ కమ్ముల క్లారిటీ!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రజల కష్టాలను తెలియజేస్తూ తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విషయాలను అందుకున్నాయని చెప్పవచ్చు.

 Leader Sequel With Rana Shekhar Kammula Clarity-TeluguStop.com

ఇలా రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో దగ్గుబాటి రానాను హీరోగా పరిచయం చేస్తూ.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “లీడర్” సినిమా ఒకటని చెప్పుకోవచ్చు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకొని రానా సినిమా కెరియర్ కు మంచి సినిమాగా నిలిచింది.

 Leader Sequel With Rana Shekhar Kammula Clarity-రానాతో లీడర్ సీక్వెల్.. శేఖర్ కమ్ముల క్లారిటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లీడర్ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న రానా ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ ఏకంగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు.

ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న రానా నటించిన మొదటి చిత్రం లీడర్ సినిమాకు సీక్వెల్ చిత్రం రాబోతుంది అంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.ఒక సరికొత్త ఫార్మెట్ లో లీడర్ సినిమా సీక్వెల్ గా లీడర్2 చిత్రం రాబోతుందని వార్తలు వచ్చాయి.

ఇక తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా రిలీజ్ ఈవెంట్ లో భాగంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.రానా నటించినటువంటి లీడర్ సినిమా సీక్వెల్ చిత్రం త్వరలోనే రాబోతుందని ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల తెలియజేశారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని.త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడుతుందని ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల లీడర్ సీక్వెల్ చిత్రం గురించి క్లారిటీ ఇచ్చారు.

#Rana #Shekar Kammula

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు