ఇండస్ట్రీ నుంచి సాయం చేసింది వాళ్లు మాత్రమే.. నాన్న మరణంతో అలా చేశానంటూ?

Laxmipati Daughter Swetha Comments Goes Viral In Social Media Details Here , Laxmipati Daughter Swetha , Swetha Career,Lakshmipati, Prabhas, Mahesh, Ajay

సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ కమెడియన్ గా గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో కమెడియన్ లక్ష్మీపతి( Lakshmipati ) ఒకరు.తక్కువ సినిమాలే చేసినా ఆ సినిమాలు లక్ష్మీపతికి మంచి పేరును తెచ్చిపెట్టాయి.

 Laxmipati Daughter Swetha Comments Goes Viral In Social Media Details Here , Lax-TeluguStop.com

లక్ష్మీపతి కూతురు శ్వేత( swetha ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.మా కుటుంబంలో ఒకరి జీవితంలో మరొకరు జోక్యం చేసుకోరని ఆమె అన్నారు.

నచ్చింది చేసే అవకాశం ఉంటుందని అని ఆమె తెలిపారు.

మా కుటుంబంలో చదువు అనేది జ్ఞానం కోసమే అని భావించే వారని ఆమె చెప్పుకొచ్చారు.

నాన్న రైటింగ్ లో పంచ్ లు అద్భుతంగా ఉండేవని ఆమె అన్నారు.నాన్న యాక్టర్ అయిన సమయంలో చాలా ఆలోచించారని శ్వేత చెప్పుకొచ్చారు.నాన్న యాక్టింగ్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ సక్సెస్ అయ్యారని ఆమె తెలిపారు.ఫ్యామిలీ వల్లే నాన్న ఆ నిర్ణయం తీసుకున్నారని శ్వేత కామెంట్లు చేశారు.

బాబాయ్ నాన్న మధ్య మంచి బాండింగ్ ఉండేదని ఆమె చెప్పుకొచ్చారు.నేను నాన్నగారికి ఒకసారి సలహా ఇస్తే గుడ్డొచ్చి పిల్లకు చెప్పిందని కామెంట్లు వచ్చేవని శ్వేత పేర్కొన్నారు.లక్ష్మీపతి కూతురు శ్వేత మాట్లడుతూ నాన్న మరణం ఎంతగానో బాధ పెట్టిందని ఆమె అన్నారు.ప్రభాస్, మహేష్, అజయ్( Prabhas, Mahesh, Ajay ) ఇండస్ట్రీ నుంచి సహాయం చేశారని ఆమె తెలిపారు.

నాన్న మరణంతో నాలుగేళ్లు డిప్రెషన్ లోకి వెళ్లానని శ్వేత పేర్కొన్నారు.

మా ఇంట్లో సేవింగ్స్ తక్కువని ఆమె చెప్పుకొచ్చారు.నేను వర్కింగ్ కావడంతో బాధ్యతల ఆధారంగా ప్రాజెక్ట్స్ చేశానని నేను తప్ప చెయ్యడానికి ఎవరూ లేరని ఆమె తెలిపారు.శ్వేత వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

శ్వేత ప్రస్తుతం విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తుండటం గమనార్హం.శ్వేత కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.

Video : Laxmipati Daughter Swetha Comments Goes Viral In Social Media Details Here #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube