బాలయ్యపై జగన్ అభిమానాన్ని బయటపెట్టిన లక్ష్మీపార్వతి..?

సీనియర్ ఎన్టీఆర్ భార్య, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి తాజాగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు బాలకృష్ణ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.బాలకృష్ణ అంటే తనకు ఎంతో ఇష్టం, అభిమానం అని బాలయ్య అమ్మా అంటూ ప్రేమగా పిలిచేవారని లక్ష్మీపార్వతి తెలిపారు.

 Laxmi Parvati Interesting Comments About Balayya And Jagan Relation  Balakrishna-TeluguStop.com

నెల్లూరు జిల్లాలోని ముసునూరులో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన లక్ష్మీపార్వతి ఇప్పటికీ బాలయ్య అంటే ఎంతో ప్రేమని చెప్పారు.

బాలకృష్ణ మనస్తత్వాన్ని చంద్రబాబు కలుషితం చేశాడని ఆమె అన్నారు.

బాలకృష్ణపై గతంలో ఒక కేసు నమోదైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహాయం చేశారని అదే సమయంలో చంద్రబాబు అధికారంలో ఉంటే బాలకృష్ణను అరెస్ట్ చేయించేవారని చెప్పారు.ఆరోజు తాను వైఎస్సార్ దగ్గరకు వెళ్లి బాలకృష్ణ అమాయకుడని, బాలకృష్ణను కాపాడాలని కోరానని చెప్పారు.

జగన్ కూడా బాలయ్య విషయంలో సహాయం చేయమని వైఎస్సార్ కు రికమెండ్ చేశారని తెలిపారు.

ఆ సమయంలో వైఎస్సార్ అంతా మంచే జరుగుతుందని చెప్పి తనను పంపించేశారని.

జగన్ బాలకృష్ణకు అభిమాని కాబట్టి ఆ అభిమానాన్ని ఆ విధంగా చాటుకున్నానని వెల్లడించారు.చంద్రబాబు కుట్రల వల్లే సీనియర్ ఎన్టీఆర్ మరణించారని.

చంద్రబాబుతో చేతులు కలిపిన వాళ్లను ఎన్టీఆర్ కు ద్రోహం చేసిన వాళ్లలానే పరిగణించాలని చెప్పారు.చంద్రబాబు ఏ ఎన్నికలు జరిగినా ఎన్టీఆర్ పేరును వాడుకుంటూ లబ్ధి పొందాలని చూస్తున్నారని వెల్లడించారు.

అల్లుడి బాగోతం అత్తకు మాత్రమే తెలుస్తుందని చంద్రబాబు గురించి చెప్పే హక్కు తనకే ఉందని ఆమె అన్నారు. చంద్రబాబును జైలుకు పంపే వరకు వదలనని.

ఎన్టీఆర్ ఆశయాలను అమలు చేస్తున్న జగన్ మాత్రమే ఎన్టీఆర్ కు అసలైన వారసుడని కామెంట్లు చేశారు.చంద్రబాబు తనపై పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారని లక్ష్మీపార్వతి తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube