బిగ్ బాస్ పనికిమాలిన షో అంటున్న ప్రముఖ నటి..  

laxmi menon sensational comments on bigg boss show, bigg boss show, laxmi menon, Tamil Industry, Vedalam movie - Telugu Bigg Boss Show, Kamal Hasan, Laxmi Menon, Laxmi Menon Sensational Comments On Bigg Boss Show, Meera Mithun, Tamil Industry, Vedalam Movie

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో కు ఉండే క్రేజే వేరు.చాలామంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొనాలని తహతహలాడుతుంటారు.

TeluguStop.com - Laxmi Menon Sensational Comments On Bigg Boss Show

ఈ షో ద్వారా ఫేమ్ సంపాదించి అవకాశాలు సంపాదించుకున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు.తెలుగు.

తమిళం, హిందీ, కన్నడ భాషలతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ షో సూపర్ సక్సెస్ అయింది.సెలబ్రిటీలు నిజ జీవితంలో ఎలా ఉంటారో, వాళ్ల మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలిపే షో కావడంతో ఈ షోకు ఇంత క్రేజ్ ఉంది.
అయితే ఈ షో గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి.తాజాగా ప్రముఖ నటి లక్ష్మీ మీనన్ బిగ్ బాస్ షో గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

TeluguStop.com - బిగ్ బాస్ పనికిమాలిన షో అంటున్న ప్రముఖ నటి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

త్వరలో తమిళ బిగ్ బాస్ షో ప్రారంభం కానుండటంతో లక్ష్మీ మీనన్ బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నారంటూ ప్రచారం జరిగింది.దీంతో లక్ష్మీ మీనన్ తాను బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదని స్పష్టతనివ్వడంతో పాటు బిగ్ బాస్ పనికిమాలిన షో అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరైన లక్ష్మీ మీనన్ కథ, సినిమాలోని పాత్ర నచ్చితేనే సినిమాలో నటిస్తుందనే పేరు ఉంది.ఆమె బిగ్ బాస్ షో కెమెరా ముందు ఫేమస్ కావడానికి పాల్గొనే షిట్ షో అని.ప్లేట్లు కడగాలని, ఇతరుల మరుగుదొడ్లు కడగాలని తాను అనుకోలేదని.అంత దుస్థితి తనకు పట్టలేదని చెప్పుకొచ్చింది.

వేదాళం సినిమాలో అజిత్ సోదరి పాత్రతో లక్ష్మీ మీనన్కు మంచి గుర్తింపు వచ్చింది.

బిగ్ బాస్ షో గురించి లక్ష్మీ మీనన్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి.

కొందరు లక్ష్మీమీనన్ చెప్పింది కరెక్ట్ అని చెబుతుంటే మరి కొందరు ఆమెపై విమర్శలు చేస్తున్నారు.

#Tamil Industry #Laxmi Menon #Bigg Boss Show #LaxmiMenon #Meera Mithun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Laxmi Menon Sensational Comments On Bigg Boss Show Related Telugu News,Photos/Pics,Images..