కోర్టులో ఫోన్ పేలడంతో న్యాయవాది షాక్.. !

ఎంత రేటు పెట్టి కొన్నా ఫోన్ అయినాగాని ఒక్కోసారి పేలిపోయిన ఘటనలను మనం చాలానే చూసి ఉంటాము.తక్కువ రకం ఫోన్ల విషయం మాట పక్కన పెడితే బ్రాండెడ్ కంపెనీ ఫోన్లు కూడా పేలిపోవడం కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.

 Lawyer Shocked On Seeing The Phone Blasted In The Court-TeluguStop.com

అయితే ఫోన్లు ఎప్పుడు ఎక్కడ ఎలా పేలిపోతాయో అనే విషయం వాటికి కూడా తెలియదు.అది ఇల్లా లేక ఆఫీసా అనే విషయం వాటికి ఏమి తెలుసు చెప్పండి.

అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ఒక లాయర్ కోర్టులో కేసు వాదిస్తూ ఉండగా సడెన్ గా ఫోన్ పేలిపోయింది.అది గమనించిన న్యాయవాది వెంటనే అలెర్ట్ అవ్వడంతో ప్రమాదం నుంచి బయట పడ్డాడు.

 Lawyer Shocked On Seeing The Phone Blasted In The Court-కోర్టులో ఫోన్ పేలడంతో న్యాయవాది షాక్.. -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఆ లాయర్ ఫోన్ కొని కూడా ఎక్కువ కాలం కూడా కాలేదట.కొన్నా కొన్ని రోజులకే ఇలా ఫోన్ పేలిపోవడం పట్ల ఫోన్ కంపనీ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.

అసలు వివరాల్లోకి వెళితే.

ఈ ఘటన దేశ రాజధాని ఉత్తర ఢిల్లీలోని హజారీ కోర్టులో చోటు చేసుకుంది.

కోర్టులో ఒక కేసుకు సంబంధించి ఇరు వర్గాల మధ్య విచారణ జరుగుతున్న సమయంలో న్యాయవాది గౌరవ్ గులాటి జేబులో గల వన్‌ప్లస్ నార్డ్-2 స్మార్ట్‌ఫోన్‌ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి.మంటలను వెంటనే గమనించిన గౌరవ్ జేబులో ఉన్నా ఫోన్ తీసి కింద పడేసాడు.

ఫోన్ కింద పడిన కొద్ది సేపటికి ఢమాల్ అంటూ శబ్ధం చేస్తూ పేలిపోయింది.గౌరవ్ జేబులో నుంచి మంటలు రావడం గమనించి ఫోన్ కిందపడేయకపోతే అతడి జేబులోని ఫోన్ పేలిపోయే గాయాల పాలయ్యేవాడు.

కానీ వెంటనే అలెర్ట్ అవ్వడంతో స్వల్ప గాయాలతో బయట పడ్డాడు.

ఈ సంఘటన పట్ల న్యాయవాది గులాటి మాట్లాడుతూ నేను వన్‌ప్లస్ నార్డ్-2 స్మార్ట్‌ఫోన్‌ ఈ మధ్య కాలంలోనే కొన్నాను.కొని కూడా చాలా రోజులు అవ్వలేదు.కానీ ఆ ఫోన్ పేలిపోయింది.

నేను వన్‌ప్లస్ సంస్థను సంప్రదించకుండా నేరుగా ఆ సంస్థపై న్యాయపోరాటం చేస్తానని గులాటి తెలిపారు.విషయం తెలుసుకున్న వన్‌ప్లస్ సంస్థ కూడా స్పందించి ఆ ఫోన్‌ను పరీక్షించకుండా నష్ట పరిహారం చెల్లించడానికి వీలులేదు అని తెలిపింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నంలో వన్ ప్లస్ సంస్థ న్యాయవాది గౌరవ్‌ను సంప్రదిచిన ఆయన మాత్రం వారికి తిరిగి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదని వన్ ప్లస్ సంస్థ తెలిపింది.

#Shock #Phone #AdvocateGourav #Delhi Hazari #Phone

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు