ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్( Shanmukh Jaswanth ) అరెస్ట్ అభిమానులను ఎంతగానో బాధ పెట్టిన సంగతి తెలిసిందే.షణ్ముఖ్ జశ్వంత్ కుటుంబ సభ్యులు సైతం మీడియాతో మాట్లాడటానికి ఆసక్తి చూపలేదు.
అయితే షణ్ముఖ్ అరెస్ట్ అయినప్పటి నుంచి ప్రముఖ లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర( Kalyan Dilip Sunkara ) ఈ కేసులో షణ్ముఖ్ తప్పేం లేదంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెట్టడం జరిగింది.అయితే షణ్ముఖ్ కు ఆయన సపోర్ట్ చేయడం గురించి కూడా కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించాయి.
కళ్యాణ్ దిలీప్ సుంకర తన సొంత యూట్యూబ్ ఛానల్( YouTube channel ) ద్వారా షణ్ముఖ్ కేసును టేకప్ చేయడానికి గల కారణాలను వెల్లడించారు.షణ్ముఖ్ కు ఇప్పటికే బెయిల్ వచ్చింది.
షణ్ముఖ్ కేసు ఫీజు గురించి చేసిన కేసు కాదని ఆయన అన్నారు.మీడియా ఒకానొక సమయంలో నా జీవితాన్ని తలక్రిందులు చేసే ప్రయత్నం చేసిందని ఆయన అన్నారు.
మీడియా వల్ల నా కుటుంబం కూడా ఆవేదనకు గురైందని కళ్యాణ్ దిలీప్ సుంకర వెల్లడించారు.

షణ్ముఖ్ తప్పు చేసి ఉంటే కౌన్సిలింగ్ ఇప్పించాలని తప్పు చేయకపోతే విడిపించాలని షణ్ముఖ్ పని చేసిన సంస్థ కోరిందని ఆయన అన్నారు.మీడియా సొంత అభిప్రాయాలను ప్రజలపై రుద్దడం ఏంటని ఆయన ప్రశ్నించారు.వాస్తవాలను వక్రీకరించి చెబుతుండటంతో నేను ఈ కేసును తీసుకున్నారనని ఆయన కామెంట్లు చేశారు.
చందూసాయి( Chandusai ) విషయంలో బెయిల్ తీసుకొస్తే కూడా ఇలానే కామెంట్లు చేశారని దిలీప్ సుంకర అన్నారు.

సంపత్ వినయ్ ఆ అమ్మాయితో పెళ్లి వద్దనుకోవడానికి వేరే కారణాలు ఉన్నాయని ఆయన తెలిపారు.ఏ మీడియా అధినేత జీవితం పర్ఫెక్ట్ గా ఉందని దిలీప్ సుంకర ప్రశ్నించారు.షణ్ముఖ్ తప్పు చేసి ఉంటే అతనికి శిక్ష పడుతుంది కదా? తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకునే సమయం కూడా ఇవ్వరా? అని ఆయన ప్రశ్నించారు.కళ్యాణ్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.







