వివాదంలో టీటీడీ ! పరువునష్టం కేసులో ' ఫీజు' కలకలం  

  • కొద్ది నెలల క్రితం వరకూ టీటీడీ తరుచూ వార్తల్లో ఉండేది. మాజీఏ ప్రధానార్చకుడు రమణదీక్షితులు టీటీడీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, పింక్ డైమండ్ పోయిందని ఇలా అనేక ఆరోపణలు చేస్తూ వివాదం రేపాడు. ఆ తరువాత ఈ వ్యవహారం సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. ఆ తరువాత దీక్షుతులుకి తోడుగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా రంగంలోకి దిగి అనేక ఆరోపణలు చేసాడు. ఆ తరువాత తరువాత ఈ గొడవ సద్దుమణిగినట్టు కనిపించింది. కానీ రమణదీక్షితులు, విజయసాయి రెడ్డి మీద టీటీడీ పరువు నష్టం దావా వేసింది. అయితే … కోర్టు ఫీజు కింద లేయర్ కి చెల్లించిన ఫీజు విషయంలో ఇప్పుడు దుమారం రేగుతోంది.

  • Lawyer Fee Is 2cr For TTD Case Against Ramana Deekshitulu-

    Lawyer Fee Is 2cr For TTD Case Against Ramana Deekshitulu

  • ఇటీవల కోర్టులో పరువు నష్టం కేసు వేసిన టీటీడీ లాయర్ ఫీజు కింద 2 కోట్ల రూపాయలు చెల్లించడమే కలకలం రేపుతోంది. ఈ మొత్తం వ్యవహారం తిరుమల మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు దగ్గర మొదలైంది. కొద్ది నెలల కింద రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. పింక్ డైమండ్ మిస్సింగ్ వ్యవహారం, శ్రీవారి ఆలయంలో అపచారాలు జరుగుతున్నాయనడం ఆలయం లోపల తవ్వకాల్లో నిధులు బయట పడ్డాయనీ అవి ఏమయ్యాయని ప్రశ్నించడం అప్పట్లో హాట్ టాపిక్‌ గా మారింది. ఇదే అదనుగా తీసుకున్న ప్రతి పక్షాలు నిజాలు తేల్చమని పట్టుబట్టాయి.

  • Lawyer Fee Is 2cr For TTD Case Against Ramana Deekshitulu-
  • ఈ వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా టీటీడీ పై విమర్శలు చేయడంతో … టీటీడీ వారిద్దరిపై 200 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసింది. అయితే ఆ కేసు వాదించడానికి నియమించుకున్న లాయర్ కు అక్షరాలా 2 కోట్ల రూపాయలు ఫీజు చెల్లించడమే ఇప్పుడు వివాదం రాజేసింది. శ్రీవారికి భక్తులు కానుకల రూపంలో, ముడుపుల రూపంలో చెల్లించిన సొమ్మును కోర్టు ఫీజుల కింద వృధా చేస్తున్నారంటూ భక్తులు విమర్శిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై ఎలా ముందుకు వెళ్ళాలి అనే సందేహంలో టీటీడీ అధికారులు సతమతం అవుతున్నారు.