కాంచన హిందీ రీమేక్ నుంచి బయటకొచ్చిన లారెన్స్! ఆవేదనతో ట్వీట్  

కంచన హిందీ రీమేక్ నుంచి తప్పుకున్న లారెన్స్. .

Lawrence Walkout From Kanchana Movie Remake-

లారెన్స్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన కాంచన సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ముని సిరిస్ లో రెండో సినిమాగా వచ్చిన ఈ సినిమా అంచనాలకి మించి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో కాంచన పేరుతో లారెన్స్ తమిళంలో వరుస సీక్వెల్స్ చేస్తున్నాడు..

కాంచన హిందీ రీమేక్ నుంచి బయటకొచ్చిన లారెన్స్! ఆవేదనతో ట్వీట్-Lawrence Walkout From Kanchana Movie Remake

తాజాగా కాంచన సిరిస్ లో నాలుగో భాగం ప్రేక్షకుల ముందుకి వచ్చి డివైడ్ టాక్ తెచ్చుకున్న భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఇదిలా ఉంటే అక్షయ్ కుమార్ హీరోగా బాలీవుడ్ లో కాంచన సినిమాని రీమేక్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి లక్ష్మి బాంబ్ అని పేరు పెట్టారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఇదిలా ఉంటే ఉన్నపళంగా ఇప్పుడు ఈ సినిమా నుంచి దర్శకుడు లారెన్స్ తప్పుకోవడం సంచలనంగా మారింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

అయితే ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన విషయం కూడా లారెన్స్ కి తెలియదని తెలుస్తుంది. ఈ పోస్టర్ రిలీజ్ తో భాగా డిస్టర్బ్ అయిన లారెన్స్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టి తన ఆవేదన వ్యక్తం చేసాడు. లక్ష్మి బాంబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ తన ప్రమేయం లేకుండానే జరిగిపోయింది.

ఎవరో చెబితే ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన విషయం తనకి తెలిసింది. ఇక ఫస్ట్ లుక్ తనకి ఎంత మాత్రం నచ్చలేదు, అందుకే ఈ సినిమా నుంచి తప్పుకుంటున్న. అక్షయ్ కుమార్ మీద ఉన్న అభిమానంతో కథ వాళ్ళ చేతికి ఇస్తున్న ఇక ఎవరితో తీసుకుంటారో అనేది వాళ్ళ ఇష్టం అనే పోస్ట్ పెట్టి తాను తప్పుకుంటున్న విషయాన్ని స్పష్టం చేసారు.