కమల్ హసన్ కి విలన్ గా మారబోతున్న రాఘవ లారెన్స్

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ప్రస్తుతం హీరో, విలన్ అనే తేడాలు పోయాయనే చెప్పాలి.ఎందుకంటే ఒక బాషలో హీరోలుగా ఉన్నవారు వేరొక బాషలో విలన్స్ గా మెప్పిస్తున్నారు.

 Lawrence Turns Villain For Kamal Haasan-TeluguStop.com

ఇప్పుడు మోసగాళ్ళు సినిమాలో మంచు విష్ణు కూడా పూర్తిస్థాయి నెగిటివ్ రోల్ లోనే కనిపిస్తున్నాడు.ఈ సినిమాలో సునీల్ శెట్టి హీరో అనే విషయాన్ని ఇప్పటికే మంచు విష్ణు రివీల్ చేశారు.

అలాగే కన్నడ ఇండస్ట్రీకి చెందిన కిచ్చా సుదీప్, ఉపేంద్ర విలన్స్ గా మారిపోయారు.కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి, ఆర్య, విశాల్ విలన్స్ గా నటించి తమని తాము ప్రూవ్ చేసుకున్నారు.

 Lawrence Turns Villain For Kamal Haasan-కమల్ హసన్ కి విలన్ గా మారబోతున్న రాఘవ లారెన్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు హీరోలు మాత్రమే ఇంకా పూర్తిస్థాయిలో విలన్స్ గా ప్రయత్నం చేయడం లేదు.అయితే కోలీవుడ్ లో ఇప్పుడు ఈ ట్రెండ్ ని మిగిలిన నటులు కూడా కొనసాగించే పనిలో ఉన్నారు.

దర్శకుడు లోకేష్ కనగరాజ్ విజయ్ మాస్టర్ సినిమా కోసం విజయ్ సేతుపతిని పవర్ ఫుల్ విలన్ గా ప్రెజెంట్ చేశాడు.ఇప్పుడు కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడుగా, హీరోగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న లారెన్స్ ని లోకేష్ ఇప్పుడు విలన్ గా మార్చబోతున్నట్లు తెలుస్తుంది.

లోకేష్ ప్రస్తుతం కమల్ హసన్ తో విక్రమ్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.అయితే కమల్ హసన్ ఎన్నికల కారణంగా సినిమా షూటింగ్ కి కొంత గ్యాప్ ఇచ్చారు.ఎన్నికలు అయిన తర్వాత మరల రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది.

ఇందులో విలన్ గా రాఘవ లారెన్స్ ని చూపించబోతున్నట్లు కోలీవుడ్ లో వినిపిస్తున్న టాక్.ఇప్పటికే లోకేష్ లారెన్స్ కి స్టొరీ చెప్పడం జరిగిందని, అతను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.

త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ ని దర్శకుడు లోకేష్ ఇచ్చే అవకాశం ఉందని బోగట్టా.

#Kamal Haasan #Kollywood #Lawrence

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు