కాంచన 3 కోసం 1400 మంది డ్యాన్సర్స్! కొత్తగా ట్రై చేసిన లారెన్స్  

కాంచన 3 లో స్పెషల్ సాంగ్ కోసం కోటి రూపాయిలు ఖర్చు పెట్టిన లారెన్స్. .

Lawrence Shoot The Special For Kanchana 3-kollywood,lawrence,south Cinema,tollywood

కొరియోగ్రాఫర్ నుంచి హీరోగా టర్న్ అయ్యి దర్శకుడుగా మారిన వ్యక్తి లారెన్స్. లారెన్స్ అంటే ప్రస్తుతం సౌత్ ఇండియాలో అందరికి వెంటనే కాంచన సిరిస్ గుర్తుకొస్తుంది. వరుసగా హర్రర్ కామెడీ చిత్రాలని సీక్వెల్స్ గా తెరకెక్కిస్తున్న రాఘవ లారెన్స్ అందులో నాలుగో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకి తీసుకోచ్చేస్తున్నాడు..

కాంచన 3 కోసం 1400 మంది డ్యాన్సర్స్! కొత్తగా ట్రై చేసిన లారెన్స్ -Lawrence Shoot The Special Song For Kanchana 3

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ మిగిలిన సినిమాల కంటే ఎక్కువగా భయపెట్టింది అని చెప్పాలి. ఇక ఇందులో లారెన్స్ చాలా మాసివ్ గా కనిపిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో లారెన్స్ ఓ స్పెషల్ సాంగ్ ని చిత్రీకరించాడని, అది సినిమాకే హైలెట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

కేవలం సినిమాలో ఆ ఒక్క పాట కోసం 1400మంది ఆర్టిస్టుల కోసం ఏకంగా కోటి రూపాయిలు ఖర్చు పెట్టాడని తెలుస్తుంది. 1400 మంది డాన్సర్స్‌తో అత్యద్భుతంగా ఈ పాటను షూట్‌ చేశారని సమాచారం. ఇందులో 400 మంది అఘోరా గెటప్‌లో, 1000 మంది విభిన్నమైన లుక్‌లో కనిపిస్తారని. 6 రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించారని తెలుస్తుంది. త్వరలో ఈ పాటని రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.