రెండున్నర సంవత్సరాల క్రితం వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం ఇంకా ప్రేక్షకుల మనసుల నుండి వెళ్లి పోవడం లేదు.అందులో చిట్టిబాబుగా రామ్ చరణ్ పాత్ర ఇక రామలక్ష్మి పాత్రలో సమంత నటించిన తీరు అద్బుతంగా ఉంది అంటూ కామెంట్స్ అందుకున్నారు.సుకుమార్ అద్బుతంగా ఆ సినిమాను తెరకెక్కించాడు.1980 కాలం కథతో సాగిన రంగస్థలం చిత్రంను రీమేక్ చేసి ఆ మ్యాజిక్ ను రీ క్రియేట్ చేయడం సాధ్యం కాదు అని చాలా మంది అనుకుంటున్నారు.కాని తమిళంలో రంగస్థలంను రీ క్రియేట్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ రంగస్థలం చిత్రం రీమేక్ రైట్స్‌ను దక్కించుకుంది.
విలక్షణ నటుడిగా గుర్తింపు దక్కించుకున్న లారెన్స్ ఈ రీమేక్ లో నటించబోతున్నాడు.అందుకు సంబంధించిన చర్చలు దాదాపుగా పూర్తి అయ్యాయి.
స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.అయితే దర్శకుడి విషయంలో ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
కనుక లారెన్స్ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించే అవకాశం ఉందేమో అంటున్నారు.నిక్కీ గర్లానీ హీరోయిన్గా నటించబోతుందట.
తమిళంలో ఇలాంటి సినిమాలకు మంచి ఆధరణ ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.భారీ ఎత్తున అంచనాలున్న రంగస్థలం తమిళ రీమేక్‌ను వచ్చే ఏడాది సమ్మర్లో ప్రారంభించి 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.టాలీవుడ్లో ఇండస్ట్రీ హిట్ అయిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయినా కూడా చాలా పెద్ద గొప్ప విషయంగా చెప్పుకుంటున్నారు.మరి రంగస్థలం అరవ తంబీలకు ఎలా ఎక్కుతుందో చూడాలి.