కాంచన 3 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన లారెన్స్!  

కాంచన 3 రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసిన లారెన్స్. ఏప్రిల్ 19న రిలీజ్..

  • డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ కొరియోగ్రాఫర్ గా,నటుడుగా తరువాత దర్శకుడుగా మారిన వ్యక్తి రాఘవ లారెన్స్ స్టైల్ సినిమాతో సత్తా చాటాడు. తరువాత తెలుగులో మాస్, డాన్, రెబల్ వంటి సినిమాలని తెరకెక్కించాడు. అదే సమయంలో హర్రర్ జోనర్ లో ముని సినిమా తో మొదటి సారి ప్రేక్షకులని నవ్విస్తూ, భయపెట్టాడు. ఇక దానికి సీక్వెల్ గా తెరకెక్కిన కాంచన, గంగ ఎంత సూపర్ హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. దీంతో లారెన్స్ ఈ హర్రర్ కామెడీ సిరిస్ లో నాలుగో సినిమాని కూడా రెడీ చేసాడు.

  • కాంచన 3గా తెరకెక్కిన ఈ సినిమాలో లారెన్స్ కి జోడీగా తమిళ బిగ్ బాస్ భామ ఒవియా నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఫినిష్ చేసిన లారెన్స్ ఆ మధ్య అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ని ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు లారెన్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేసారు. కాంచన సిరిస్ లో వస్తున్నా ఈ సినిమా ప్రేక్షకులని మళ్ళీ ఎ స్థాయిలో భయపెడుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.