నయనతారను ఫాలో అవుతానంటున్న లారెన్స్

ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ కమ్ యాక్టర్ రాఘవ లారెన్స్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.తనదైన యాక్టింగ్‌తో పాటు పలు హిట్ సినిమాలు అందించిన ఈ దర్శకుడు తమిళనాట చాలా పేరున్న వ్యక్తిగా నిలిచాడు.

 Lawrence Decided Not To Attend Events-TeluguStop.com

అయితే లారెన్స్ తాజాగా హీరోయిన్ నయనతారను నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు.

నటి నయనతార ఇండస్ట్రీలో ఎలాంటి వేడుకకు హాజరుకాదు.

సినిమా ఈవెంట్స్‌కు ఆమె చాలా దూరంలో ఉంటుంది.తాను నటించిన సినిమా ప్రమోషన్స్‌లో కూడా నయన్ పాల్గొన్న దాఖలాలు లేవు.

ఇప్పుడు ఆమె బాటలో లారెన్స్ కూడా నడవాలని నిర్ణయించుకున్నాడట.దీనికి సంబంధించి లారెన్స్ తాజాగా ఓ ప్రకటన చేశాడు.

దీనికి కారణం కూడా ఏమిటో చెప్పాడు.ఇటీవల రజినీకాంత్ దర్బార్ ఆడియో వేడుకలో లారెన్స్ చేసిన కొన్ని కామెంట్లకు విమర్శలు ఎదురయ్యాయి.

Telugu Kollywood, Lawrence, Nayantara, Raghav Lawrence, Rajinikanth-

తాను చిన్నతనం నుండి రజినీ సినిమాలు చూసి పెరిగానని, కమల్ హాసన్ సినిమా పోస్టర్లపై పేడకొట్టేవాడినని లారెన్స్ చెప్పాడు.దీంతో కమల్ హాసన్ ఫ్యాన్స్ లారెన్స్‌ను టార్గెట్ చేశారు.దీంతో లారెన్స్ ఇంకెప్పుడు సినిమా ఈవెంట్స్‌కు హాజరుకావద్దని నిర్ణయం తీసుకున్నాడు.మరి లారెన్స్ నిర్ణయంపై ఆయన అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube