వైరల్: పంది, గొడ్డు మాంసం కోసం కొట్టుకున్న రాజకీయనాయకులు!  

ప్రజాప్రతినిధులు అంటే చట్టసభలలో ఎంతో హుందాగా నడుచుకొని చట్టసభల ప్రతిష్టలు పెంచేలా ఉండాలి కానీ, ఏకంగా చట్టసభలలో ఒకరిపై ఒకరు చేయి చేసుకొని చట్టసభలో అప్రతిష్ట పాలయ్యారు.ప్రజా ప్రతినిధులు వారి కర్తవ్యాన్ని మరచి ఒకరిపై ఒకరు చేయి చేసుకున్న ఘటన తైవాన్ పార్లమెంట్ లో శుక్రవారం చోటు చేసుకుంది.

TeluguStop.com - Lawmakers Throw Pig Guts Punches On Taiwan Parliament On Yesterday

శుక్రవారం పార్లమెంటులో ఏకంగా మాంసం ముద్దలతో అధికార, ప్రతిపక్ష ఎంపీలు పరస్పరం దాడి చేసుకున్నారు.

అమెరికానుంచి పంది, గొడ్డు మాంసం దిగుమతిపై పార్లమెంటులో చర్చ జరుగుతుండగా, ఈ విషయంపై ప్రతిపక్షాలు,అధికార పక్షాల మధ్య తీవ్ర విమర్శలు తలెత్తడంతో ఒక్కసారిగా పార్లమెంట్ రణరంగాన్ని తలపించింది.

TeluguStop.com - వైరల్: పంది, గొడ్డు మాంసం కోసం కొట్టుకున్న రాజకీయనాయకులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకున్న తర్వాత ఆగస్టు నుంచి పంది మాంసం దిగుమతి పై ఉన్న నిషేధం ఎత్తివేయడం తో ఈ విషయం మరొక సారి చర్చనీయాంశమైంది.

దీనికి సంబంధించిన నివేదికను ప్రీమియర్‌ సు సెంగ్‌-చాంగ్‌ పార్లమెంట్‌ సభ్యులకు వివరిస్తుండగా ప్రతిపక్ష నేషనలిస్ట్ పార్టీ సభ్యులు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలి, అప్పటికే పార్లమెంట్ ఆవరణలోకి ప్రతిపక్ష సభ్యులు బ్యాగులతో నిండిన పంది మాంసాన్ని తీసుకురావడంతో ఒక్కసారిగా ఒకరిపై ఒకరు మాంసపు ముద్దలను విసురుకుంటూ పరస్పరం దాడి చేసుకున్నారు.అధికార, ప్రతిపక్ష ఎంపీలు నేలపై దొర్లుతూ మరీ కొట్టుకున్నారు.ప్రస్తుతం తైవాన్లో పంది, గొడ్డు మాంసం దిగుమతులపై నిషేధాన్ని ఎత్తి వేయడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పంది గొడ్డు మాంసం దిగుమతులను వ్యతిరేకిస్తూ….

ప్రస్తుతం అధికార పక్షం లోకి రాగానే వీటి దిగుమతులకు మద్దతు తెలుపుతున్నారని,కేఎంటీ సభ్యుడు లిన్ వీ-చౌ అన్నారు.ఈ విధానాన్ని నిరసిస్తూ నల్ల రంగు టీ షర్టులు ధరించి చట్టసభలలో ప్రతిపక్షాలు నిరసన తెలిపారు.

#Throw Pig Guts #RemoveBan #Taiwan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Lawmakers Throw Pig Guts Punches On Taiwan Parliament On Yesterday Related Telugu News,Photos/Pics,Images..