తానా వైస్ ప్రెసిడెంట్ గా..లావు అంజయ్య..!!!  

Lavu Anjaiah Elected As Tana President-new Tana President,nri,tana President,telugu Nri News Updates

అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలలో అతిపెద్ద తెలుగు సంఘంగా పేరొందిన తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతని చాటుకుంటూ ఉంటుంది. అమెరికాలో ఉంటున్న తెలుగు వారికోసం, తెలుగు సంస్కృతిని కాపాడుకోవడం కోసం తానా చేసే ప్రయత్నాలు ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తాయి. తానా ఏపీలో సైతం తమవంతు సాయాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది...

తానా వైస్ ప్రెసిడెంట్ గా..లావు అంజయ్య..!!!-Lavu Anjaiah Elected As TANA President

అటువంటి తానా సంఘానికి ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్ గా లావు అంజయ్య చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019 – 23 సంవత్సరానికి గాను ఇదే పదవికి లావు అంజయ్యతో పాటు నరేన్ కొడాలి కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే నరేన్ తన నామినేషన్ వెనక్కి తీసుకోవడంతో అంజయ్య ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.

తానాలో వైస్‌ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించిన పెద్దలు అందరికి అంజయ్య కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలో అంజయ్య ఎన్నో రకాలుగా సేవాకార్యక్రమాలు చేపట్టే వారు..

అమెరికాలో ని తెలుగువారు ఎక్కడైనా ప్రమాదాలకి గురయినప్పుడు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి రక్షణ చర్యలు చేప్పట్టడంలో ముందుండే వారు. ఎన్నారైల తల్లి తండ్రులు అమెరికాలో ఇబ్బందులకి లోనవుతుంటే వారికి కావాల్సిన సాయం చేసేవారు.