లావణ్య త్రిపాఠి గ్రేట్‌.. ఆ పాత్రను మరో హీరోయిన్‌ అయినా ఒప్పుకునేది కాదేమో

కార్తికేయ నటించిన చావు కబురు చల్లగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.అల్లు అర్జున్‌ చేతుల మీదుగా విడుదల అయిన చావు కబురు చల్లగా ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

 Lavanya Tripathi Role In Kaarthikeya Chavu Kaburu Challaga Movie-TeluguStop.com

ఈ సినిమా లో హీరో కార్తికేయ డెడ్‌ బాడీలను మోసుకు వెళ్లే వాహనాలకు డ్రైవర్ గా వ్యవహరిస్తూ ఉంటాడు.ఇక లావణ్య త్రిపాఠి ఆసుపత్రిలో నర్స్‌ గా కనిపించబోతుంది.

సినిమ షూటింగ్‌ సందర్బంగా నే ఈ విషయాలను రివీల్‌ చేశారు.కాని తాజాగా ట్రైలర్‌ ను విడుదల చేసిన తర్వాత సినిమా గురించి మరి కొన్ని విషయాలపై స్పష్టత వచ్చింది.

 Lavanya Tripathi Role In Kaarthikeya Chavu Kaburu Challaga Movie-లావణ్య త్రిపాఠి గ్రేట్‌.. ఆ పాత్రను మరో హీరోయిన్‌ అయినా ఒప్పుకునేది కాదేమో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యంగా ఈ సినిమా లో లావణ్య త్రిపాఠి నర్స్ గానే కాకుండా ఒక విడోగా కూడా కనిపించబోతుంది.ఒక లీడింగ్ లో ఉన్న హీరోయిన్‌ ఇలా విడో పాత్రలో కనిపించడం అంటే నిజంగా చాలా పెద్ద విషయం.

ఆమె ఈ పాత్రను చేసేందుకు ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం.ఒక మంచి పాత్రలో నటించేందుకు ఆమెకు అవకాశం దక్కింది.

హీరోయిన్‌ లకు వరుసగా సినిమా ల ఆఫర్లు వస్తాయి.కాని కొందరికి మాత్రమే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేసే అవకాశం దక్కుతుంది.ఆ అవకాశం లావణ్య త్రిపాఠికి దక్కింది.ఇప్పటికే ఆమె నటిగా గుర్తింపు దక్కించుకోవడం లో సక్సెస్‌ అయ్యింది.

మొదటి సినిమా అందాల రాక్షసి సినిమా తో ఆమె సూపర్‌ డూపర్‌ నటి అంటూ ప్రముఖులు సైతం అభినందించారు.మళ్లీ ఇన్నాళ్లకు చావు కబురు చల్లగా పాత్రలో తన నటన ప్రతిభను కనబర్చే అవకాశంను ఆమె దక్కించుకుంది.

ఈ సినిమా తో పాటు ఆమెకు మరిన్ని మంచి ఆఫర్లు వస్తాయని అంటున్నారు.ప్రస్తుతం లావణ్య త్రిపాఠి చేస్తున్న సినిమా ల్లో ఇది ది బెస్ట్‌ గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ఆమె అభిమానులు అంటున్నారు.

భర్త చనిపోయిన ఒక యువతి గా లావణ్య త్రిపాఠి కనిపించగా ఆమె వెంట పడే వ్యక్తిగా కార్తికేయ కనిపించబోతున్నాడు.

#ChavuKaburu #Lavanya Tripati #Kaarthikeya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు