దాని కోసం కొడుకు హీరోయిన్ ని వాడేస్తున్న పవన్... నిజమేనా...   

Lavanya Tripathi Got A Chance To Act In Pawan Vakil Sab - Telugu Movie, Lavanya Tripathi Latest News, Lavanya Tripathi Vakil Sab Movie News, Pawan Kayan Movie News, Pawan Vakeel Sab Movie Heroine News, Pawan Vakeel Sab Movie News, Vakil Sab Movie Lavanya Tripathi Movie News

ప్రస్తుతం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నటువంటి పింక్ రీమేక్ చిత్రం “వకీల్ సాబ్” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రం ఇప్పటికే దాదాపుగా 50 శాతం పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుని వేసవిలోని “మే” నెలలో విడుదలకు సిద్ధమవుతోంది.

 Lavanya Tripathi Got A Chance To Act In Pawan Vakil Sab

అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి చిత్రీకరణ దాదాపుగా సగానికి పైగా పూర్తయినప్పటికీ హీరోయిన్ విషయంలో మాత్రం సరైన స్పష్టత రావడం లేదు.దీంతో ఈ చిత్రంలో నటించే కథానాయికల గురించి పలు వార్తలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ చిత్రంలో నటించడానికి కి టాలీవుడ్ అందాల తార లావణ్య త్రిపాఠిని తీసుకున్నట్లు పలు వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.అంతేకాక లావణ్య త్రిపాఠి కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా అనడంతో స్క్రిప్ట్ గురించి ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం.

దాని కోసం కొడుకు హీరోయిన్ ని వాడేస్తున్న పవన్… నిజమేనా… -Latest News-Telugu Tollywood Photo Image

అయితే ప్రస్తుతం లావణ్య త్రిపాటి ఈ చిత్ర షూటింగ్ లో కూడా పాల్గొంటున్నట్లు టాలీవుడ్ లోని పలువురు సినీ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నాను.అయితే ఈ విషయాలపై దర్శకుడు శ్రీ రామ్ వేణు మాత్రం ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు.

దీంతో ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్ గా  నటించే నటీమణుల లిస్టులో నయనతార, ఇలియానా, శృతిహాసన్, వంటి వాళ్ళ పేర్లు అప్పట్లో బలంగా వినిపించాయి.అయితే అప్పుడు కూడా దర్శకుడు శ్రీరామ్ వేణు ఈ వార్తలపై స్పందించలేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో కూడా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ కొంత కాలం పాటు వాయిదా వేసినట్లు సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు