అటు ఇటు ఆడుతూ కన్ఫ్యూజ్ చేస్తున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ వేసవి కానుకగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ చిత్రానికి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు.

 Lavanya Tripathi For Pawan Kalyan Harish Shankar Movie-TeluguStop.com

ఇక ఈ సినిమాలో పవన్ సరసన ఓ కేమియో పాత్రలో హీరోయిన్‌ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.

కాగా పవన్ సరసన ఎవరిని తీసుకోవాలా అనే అంశంపై చాలా చర్చ జరిగింది.

తొలుత ఈ పాత్రలో అందాల భామ లావణ్య త్రిపాఠీని తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.కానీ చివరకు గబ్బర్ సింగ్ బ్యూటీ శృతి హాసన్‌ను తీసుకున్నారు.అయితే పవన్ తన తరువాత సినిమాలను కూడా లైన్‌లో పెడుతున్నాడు.ఇప్పటికే డైరెక్టర్ క్రిష్‌తో సినిమా చేస్తున్న పవన్, నెక్ట్స్ మూవీని హరీష్ శంకర్ డైరెక్షన్‌లో చేయనున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా మరోసారి లావణ్య త్రిపాఠీ పేరు వినిపిస్తోంది.ఇలా అందాల రాక్షసి బ్యూటీ లావణ్య త్రిపాఠీ పేరును అటు, ఇటు తిప్పి చివరకు ఏం చేస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇంతకీ ఈ బ్యూటీకి పవన్ ఆఫర్ ఇస్తాడా లేక నిరాశే మిగిలిస్తాడా అనేది చర్చనీయాంశంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube