లావణ్య త్రిపాఠికి చేదు అనుభవం..ఏం జరిగిందంటే?

టాలీవుడ్ హీరోయిన్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.తన అందంతో, నటనతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.పైగా మోడలింగ్ రంగంలో మిస్ ఉత్తరఖండ్ గా కూడా పేరు సంపాదించుకుంది.2008లో అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాలో తొలిసారి నటనతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఆ తర్వాత వరుస ఆఫర్ లతో ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.

 Heroine Lavanya Tripathi Bad Experience With Air Asia Flight Service, Lavanya Tr-TeluguStop.com

బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించింది.అంతేకాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది లావణ్య త్రిపాఠి.

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం ఫోటోలను, వీడియోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.

ఇక ఈమెకు విపరిమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది అంతేకాకుండా అభిమానులతో కూడా తెగ ముచ్చట్లు పెడుతుంది.వాళ్లు అడిగిన ప్రశ్నలకు వెంటనే స్పందిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకి ఓ చేదు అనుభవం ఎదురయ్యింది.

Telugu Air Asia, Lavanya, Ticket Message, Tollywood-Movie

ఇక ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉన్న లావణ్య ఓ సినిమా షూటింగ్ కోసం మరో ప్రాంతానికి వెళ్లాల్సి ఉండగా అందుకు విమానంలో వెళ్లడానికి నిశ్చయించుకుంది.దీంతో కొన్ని సాంకేతిక లోపాలు వల్ల తన ప్రయాణానికి అంతరాయం కలగడంతో ఓ రేంజ్ లో మండి పడింది లావణ్య త్రిపాఠి.ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియాను ట్యాగ్ చేసి.

విమానం క్యాన్సిల్ అవుతుందన్న విషయాన్ని ముందుగా ఎందుకు తెలియజేయలేదు అని ప్రశ్నించింది.

Telugu Air Asia, Lavanya, Ticket Message, Tollywood-Movie

మరో విమానంలో సీటు బుక్ చేసుకున్న తర్వాత కూడా తనకు మెసేజ్ రావడం ఏంటని.ఇలాంటి ఘటన ఎవరికైనా జరిగిందా లేదా తనకు మాత్రమే మొదటిసారి జరిగిందా అంటూ ప్రశ్నించింది.ఇక ప్రస్తుతం రాయబారి అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.

అంతే కాకుండా మరికొన్ని సినిమాలలో కూడా అవకాశాలు అందుకుందట ఈ బ్యూటీ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube