సోదిస్టార్‌పై కేసు పెట్టిన అందాల రాక్షసి  

Lavanya Tripathi Files Case Against Sunisith - Telugu Lavanya Tripathi, Sacrifice Star, Sunishith, Telugu Movie News, Trending Star

సోషల్ మీడియా ఎవరినైనా ఫేమస్ చేస్తుందనడానికి తాజా ఉదాహరణగా నిలిచాడు టాలీవుడ్ శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్.ఈ పేరు చేబితే ఎక్కువ మంద గుర్తుపట్టక పోవచ్చు.

 Lavanya Tripathi Files Case Against Sunisith

కానీ అందాల రాక్షసి హీరోయిన్ లావణ్య త్రిపాఠీ భర్త అని చెప్పుకొచ్చిన వ్యక్తి అనగానే అందరూ ఠక్కున ఇతడిని గుర్తిస్తారు.గతకొద్ది రోజులుగా యూట్యూబ్ చానెల్స్‌లో సునిశిత్ ఇంటర్వ్యూలు ట్రెండింగ్‌లో ఉన్నాయి.

స్టార్ హీరోలు చేసిన సినిమాలను తాను ఓకే చేసి, కొంతభాగం షూటంగ్ కూడా జరిపానని, ఆ తరువాత వదిలేశానంటూ చెప్పుకొచ్చిన సునిశిత్ తానొక యాక్టర్ కమ్ సింగర్ కమ్ క్యాస్టింగ్ డైరెక్టర్ కమ్ ఎక్స్-సీఐడీ ఆఫీసర్‌ అంటూ చెప్పుకొచ్చాడు.ఇలా ఇన్ని రంగాల్లో పనిచేస్తున్నా తనకు తగిన గుర్తింపు లేదని, దానికి కారణం మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ, యాంకర్ ప్రదీప్ అంటూ చెప్పాడు.

సోదిస్టార్‌పై కేసు పెట్టిన అందాల రాక్షసి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇదంతా విన్నవారు మరి వీటికి సాక్ష్యాలు ఉన్నాయా అంటే మనోడి దగ్గర సౌండ్ లేదు.

కాగా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ఈ సోదిస్టార్ అందాల రాక్షసి ఫేం హీరోయిన్ లావణ్య త్రిపాఠీతో తనకు సీక్రెట్‌గా వివాహం జరిగిందని, కొంతకాలం కలిసే ఉన్నామని, కానీ ఇప్పుడు విడిపోయాం అంటూ కామెంట్స్ చేశాడు.

ఇవి లావణ్య వరకు చేరడంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది.తనపై ఇలా అబద్ధపు కామెంట్లు చేసి తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

దీంతో పోలీసులు సునిశిత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మహిళలను వేధిస్తే కఠిన చర్యలు ఉంటాయని, సునిశిత్ ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సింది అంటూ పలువురు అంటున్నారు.

మొత్తానికి ఈ మల్టీ ట్యాలెంటెడ్ శాక్రిఫైజ్ స్టార్‌కు మూడిందని మరికొందరు అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Lavanya Tripathi Files Case Against Sunisith Related Telugu News,Photos/Pics,Images..

footer-test