అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి బాహ్య సౌందర్యంను మాత్రమే కాకుండా అంతః సౌందర్యంను కూడా కలిగి ఉందని అనిపిస్తూ ఉంటుంది.ఆమె చాలా సార్లు ఛారిటీ కార్యక్రమాల్లో పాల్గొంది.
ఈ కరోనా సమయంలో కూడా తన మంచి మనసును చాటుకుని అందరికి ఆదర్శకంగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.నిజంగా ఆమె మంచి మనసుకు అంతా మంచి జరగాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు.
ఈమద్య కాలంలో సెలబ్రెటీలు డబ్బు కోసం ఆల్కహాల్ బ్రాండ్ లకు ప్రమోషన్ చేస్తున్నారు.అధికారికంగా కాకుండా అనధికారికంగా బ్రాండ్స్ కు వారు ప్రమోట్ చేస్తున్నారు.దాంతో వారికి భారీ మొత్తంలో డబ్బులు వస్తున్నాయి.ఆల్కహాల్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల పోస్ట్‌కు ఇంత మొత్తం అన్నట్లుగా తీసుకుంటూ ఉన్నారు.అయితే అందాల రాక్షసి లావణ్య మాత్రం తనకు అవసరం లేదు అన్నట్లుగా వారికి సమాధానం ఇచ్చిందట.
మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ అమ్మడు ప్రముఖ విస్కీ కంపెనీ పాతిక లక్షల ఆఫర్ ను ఈజీగా తిరస్కరించిందట.సోషల్ మీడియాలో రెండు పోస్ట్ లను పెట్టాల్సిందిగా ఒప్పందం.కాని ఈ అమ్మడు నో చెప్పిందనే వార్తలు వస్తున్నాయి.
తనకు విస్కీ ని ప్రమోట్ చేయాలనే ఆసక్తి లేదు.అందుకే తాను డబ్బుల కోసం ఆ పని చేయను అంది.
పూజా హెగ్డే దాదాపుగా 50 లక్షల రూపాయలు తీసుకుని ఇటీవల తన తండ్రితో ఉన్న ఫొటోను షేర్ చేసి విస్కీకి ప్రమోషన్ చేసింది.కాని లావణ్య త్రిపాఠి మాత్రం నో చెప్పింది.
ఈమె సినిమాలు ఏమీ చేయడం లేదు.ఇలాంటి వాటితో అయినా కాస్త డబ్బులు వెనుక వేసుకునే అవకాశం ఉంది.
కాని ఈమె మాత్రం అందుకు నో చెబుతోంది.ఈమె చేస్తున్న రెండు సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి .సొట్టబుగ్గల ఈ సుందరిని చూసి ఇతరులు నేర్చుకోవాలంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.లావణ్య ఆల్కహాల్ కు నో చెప్పడం చాలా మంది పరిణామం అంటూ అంతా అభినందిస్తున్నారు.