హాకీ స్టిక్ పట్టుకొని నెట్ ప్రాక్టీస్ చేస్తున్న లావణ్య త్రిపాఠి  

Lavanya Tripathi Doing Hockey Practice For A1 Express Movie - Telugu Hockey Practice For A1 Express Movie, Lavanya Tripathi, Sandeep Kishan, Tollywood

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ లావణ్య త్రిపాఠి.మొదటి సినిమాతోనే నటిగా మార్కులు కొట్టేసిన ఈ భామకి తరువాత భలేభలే మాగాడివోయ్ సినిమాతో సాలిడ్ హిట్ ఖాతాలో పడింది.

Lavanya Tripathi Doing Hockey Practice For A1 Express Movie

దానికంటే ముందు మంచు విష్ణుతో చేసిన సినిమా కూడా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది.ఆ తరువాత ఈ భామ కెరియర్ లో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి.

ప్రస్తుతం టాలీవుడ్ లో హవ కొనసాగిస్తున్న కుర్ర హీరోలతో జోడీ కట్టి వరుస సినిమాలు చేసింది.

అయితే ఆమె చేసిన సినిమాలు ఏవీ కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ కి లావణ్యని తీసుకొని వెళ్ళలేకపోయాయి.

దీంతో మెల్లగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.అయితే గత కొద్ది రోజులుగా ఈ భామ మళ్ళీ బిజీ అవుతుంది.

ప్రస్తుతం సందీప్ కిషన్ కి జోడీగా ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాలో నటిస్తుంది.ఇందులో లావణ్య హాకీ ప్లేయర్ పాత్రలో నటిస్తుంది.

ఈ పాత్రలో పెర్ఫెక్షన్ కోసం లావణ్య రోజు రెండు గంటల పాటు హాకీ స్టిక్ పట్టుకొని ట్రైనర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నెట్ ప్రాక్టీస్ చేస్తుంది.షూటింగ్ ప్రస్తుతం ఓ తమిళ సినిమా కూడా లావణ్య చేస్తూ ఉండటంతో ఉదయాన్నే లేచి నెట్ ప్రాక్టీస్ చేసుకొని షూటింగ్ లో పాల్గొంటుంది.

పాత్ర స్వభావం కోసం హాకీ నేర్చుకోవడం కోసం విపరీతంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండటం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పాలి.మరి ఈ సినిమా అయిన అమ్మడి మంచి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Lavanya Tripathi Doing Hockey Practice For A1 Express Movie Related Telugu News,Photos/Pics,Images..

footer-test