ఆ ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠి అలా చెప్పారా.. వరుణ్ తేజ్ నాకు క్లోజ్ అని చెబుతూ?

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకున్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ వార్తల గురించి అటు వరుణ్ తేజ్( Varun Tej ) కానీ ఇటు లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) కానీ స్పందించకపోవడంతో వైరల్ అయిన వార్తలు నిజమేనని నమ్మాల్సి వస్తోంది.

 Lavanya Tripathi Comments About Varun Tej Goes Viral In Social Media Details, La-TeluguStop.com

అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పై ఉన్న ఇష్టాన్ని వెల్లడించగా ఆ కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం తెలుగులో పెద్దగా ఆఫర్లు లేని లావణ్య త్రిపాఠి నా చేతికి ఉన్న ఉంగరం నా ఉంగరమే అని అది మాత్రమే నేను చెప్పగలనని అన్నారు.

ప్రతిరోజూ ఒక కొత్త కథ ప్రచారంలోకి వస్తుందని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చారు.కొన్నిసార్లు నిశ్చితార్థం ( Engagement ) జరిగిందని నేను ఎవరినీ బయట కలవకపోయినా కలిశానని వార్తలు ప్రచారంలోకి వచ్చాయని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చారు.

Telugu Niharika, Saitej, Varun Tej, Varuntej-Movie

నిహారిక ( Niharika ) నాకు బాగా క్లోజ్ అని ఆమె కామెంట్లు చేశారు.వరుణ్ తేజ్ కూడా నాకు క్లొజ్ ఫ్రెండ్ అని ఆమె వెల్లడించారు.సాయితేజ్ నేను ఎప్పుడూ మీమ్స్ ను షేర్ చేసుకుంటూ ఉంటామని లావణ్య కామెంట్లు చేశారు.నిహారిక వెడ్డింగ్ నేను చూసిన మొదటి సౌత్ ఇండియన్ వెడ్డింగ్ అని ఆమె చెప్పుకొచ్చారు.

ఈ నెల 9వ తేదీన వరుణ్ లావణ్యల నిశ్చితార్థం జరుగుతుందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.

Telugu Niharika, Saitej, Varun Tej, Varuntej-Movie

వరుణ్ లావణ్య పెళ్లి వార్త నిజమైతే మాత్రం మెగా అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.వరుణ్ లావణ్య కలిసి నటించిన సినిమాలు సక్సెస్ సాధించకపోయినా ఈ జోడీ పెళ్లి చేసుకుంటే మంచి జోడీగా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.వరుణ్ లావణ్య జోడీ బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

గతంలో ఒక ఇంటర్వ్యూలో లావణ్య చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube