హీరోను అన్న అనేసిన బ్యూటీ.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఏ1 ఎక్స్‌ప్రెస్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టి తీరాలని సందీప్ కిషన్ గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.

 Lavanya Tripathi Calls Sundeep Kishan Anna, Lavanya Tripathi, Sundeep Kishan, A1-TeluguStop.com

ఈ సినిమాను దర్శకుడు డెన్నిస్ జీవన్ కనుకొలను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.కాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ తాజాగా జరుపుకున్నారు.

ఈ ఈవెంట్‌లో ఈ సినిమా హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన స్పీచ్‌లో హీరో గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాలో సందీప్ కిషన్ హాకీ ప్లేయర్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కాగా ఈ సినిమాలో అతడితో కలిసి యాక్ట్ చేయడం చాలా కష్టంగా ఉండేదని, అతడి పర్ఫార్మెన్స్‌కు తాను ఫిదా అయ్యానంటూ లావణ్య చెప్పుకొచ్చింది.అయితే ఈ క్రమంలో సందీప్ కిషన్ అన్న అంటూ లావణ్య చెప్పుకురావడంతో అక్కడున్నవారు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

దీంతో తేరుకున్న లావణ్య, తాను సందీప్ కిషన్‌ను అన్న అన్నది అతడి ఫ్యాన్స్‌కి అంటూ కవర్ చేసుకుంది.ఈ అంశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హీరో రామ్ పోతినేని అతిథిగా వచ్చి ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకున్నాడు.

ఇక ఈ సినిమా కోసం తాను ప్రత్యేకించి హాకీ ఆటను నేర్చుకున్నట్లు లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది.

కాగా ఈ సినిమాను దర్శకుడు డెన్నిస్ జీవన్ పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరి లావణ్య తనను అన్న అన్నందుకు సందీప్ కిషన్ ఆమెకు ఎలాంటి కౌంటర్ ఇచ్చాడనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

ఇక ఈ సినిమా మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube