కరోనా దెబ్బతో ముద్దులాటకు నో అంటోన్న బ్యూటీ

అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సొట్ట బుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి, తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆ సినిమా సక్సెస్‌తో వరుసబెట్టి సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో ఇన్నేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న ఈ బ్యూటీ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేయడమే కాకుండా క్రేజ్ ఉన్న స్టార్స్‌కే ఓటేస్తుంది.

 Lavanya Tripathi To Avoid Intimate Scenes, Lavanya Tripathi, Andala Rakshasi, A1-TeluguStop.com

ఈ క్రమంలోనే నిఖిల్‌తో నటించిన ‘అర్జున్ సురవరం’ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకుంది ఈ బ్యూటీ.

ఇక ప్రస్తుతం రెండు సినిమాలను లైన్‌లో పెట్టిన ఈ బ్యూటీ, వాటి షూటింగ్‌ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ కలకలం కారణంగా తను చేయబోయే సినిమాల గురించి పలు కీలక నిర్ణయాలు తీసుకుందట.ఇకపై ఇంటిమేట్ సీన్స్‌ను చేయకూడదని లావణ్య త్రిపాఠి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా లిప్‌లాక్ లాంటి సీన్స్ ఉంటే వాటికి ఖచ్చితంగా నో చెప్పాలని, తద్వారా తన ఆరోగ్యంతో పాటు చుట్టుపక్కల ఉన్నవారి ఆరోగ్యాన్ని కూడా కాపాడగలనని ఆమె భావిస్తోంది.

మొత్తానికి కరోనా వైరస్ కారణంగా చాలా మంది పాఠాలు నేర్చుకుంటున్నారు.

ఇంకా కరోనా మహమ్మారికి మందు లేకపోవడంతో భవిష్యత్తులో కరోనా రాకుండా ఉండేందుకు తనకు సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకునేందుకు లావణ్య రెడీ అవుతోంది.మరి ఈ బ్యూటీ తీసుకున్న నిర్ణయంతో ఆమెకు సినిమా అవకాశాలు వస్తాయా, ఉన్న అవకాశాలు కూడా పోతాయా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube