తెలుగు ప్రేక్షకులకు అందాల రాక్షసి సినిమా తో పరిచయం అయిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి దశాబ్ద కాలం కాబోతున్న కూడా ఇంకా ఆఫర్ల కోసం వెదుకులాట కొనసాగించాల్సిన పరిస్థితి.హీరోయిన్ గా ఇంత కాలం ఎన్నో సినిమాలు చేసినా కూడా వాటిల్లో పెద్దగా సక్సెస్ అయినవి ఏమీ లేవు.
ఒక వేళ సక్సెస్ అయితే ఆ సక్సెస్ క్రెడిట్ కూడా ఈమెకు దక్కలేదు.ఆఫర్లు అయితే వస్తూనే ఉన్నాయి కాని అమ్మడికి సక్సెస్ లు మాత్రం దక్కడం లేదు.
ఈ ఏడాదిలో అప్పుడే ఈమె రెండు సినిమాలతో వచ్చేసింది.ఆ సినిమా లు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.
ముఖ్యంగా ఈ అమ్మడు చావు కబురు చల్లగా సినిమా పై చాలా నమ్మకం పెట్టుకుంది.కాని సినిమా కాస్త నిరాశ పర్చింది.
కార్తికేయ కు జోడీగా మల్లిక పాత్రలో అది కూడా భర్త చనిపోయిన మల్లిక పాత్ర లో ఈమె కనిపించింది.పెద్ద ఎత్తున అంచనాలున్న అందాల రాక్షసి సినిమా నిరుత్సాహ పర్చడంతో తదుపరి సినిమా కోసం మళ్లీ లావణ్య ఎదురు చూడాల్సిన పరిస్థితి.
లావణ్య త్రిపాటి చేసిన రెండు సినిమా లు కూడా మరీ ఇంత దారుణంగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అవ్వడంతో ఆమె మరీ నిరుత్సాహంను వ్యక్తం చేస్తోంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమాల్లో నటిస్తున్న లావణ్య త్రిపాఠి లక్ కలిసి రాక చతికిల్ల పడిపోతుంది.
సినిమా లు సక్సెస్ అయ్యే అవకాశం ఉందని నమ్మకంగా భావించినా కూడా అనూహ్యంగా సినిమా ప్లాప్ అవ్వడం జరుగుతుంది.ఎన్నో సందర్బాల్లో సినిమా లు నిరాశ పర్చుతున్నాయి.
ఇలాంటి సమయంలో లావణ్య మళ్లీ ఆఫర్లు దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది.ఇలాంటి ముద్దుగుమ్మ ను ఎలా పక్కన పెడుతున్నారు అనిపించేలా ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తుంది.
దాంతో ఆమె అందానికి ఫిదా అయిన వారు ఆమెను మళ్లీ హీరోయిన్ గా తీసుకోవడం జరుగుతుంది.ఇలా లావణ్య కెరీర్ అలా అలా సాగుతుందన్నమాట.