మొదటి సారి భర్త గురించి అలాంటి పోస్ట్ చేసిన లావణ్య..పోస్ట్ వైరల్!

సినీనటి లావణ్య త్రిపాఠి( Lavanya Tripati ) మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.ఈ విధంగా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్( Varun Tej ) ను ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

 Lavanya Tripathi First Post After Her Marriage Post Goes Viral, Lavanya Tripathi-TeluguStop.com

వీరి వివాహం ఇటలీలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగింది.ఇలా వీరి పెళ్లి తర్వాత మొదటిసారి లావణ్య త్రిపాఠి తన పెళ్లికి సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో చేస్తూ తన భర్త వరుణ్ తేజ్ గురించి చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

లావణ్య త్రిపాఠి తన పెళ్లి వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… నా భర్త ఎంతో జాలి కేరింగ్ ఉన్నటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి.

తన గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ వాటిని నాలోనే దాచుకుంటాను.మూడు రోజులపాటు జరిగిన మా పెళ్లి ఎంతో అద్భుతంగా ఒక కన్నుల పండుగగా జరిగింది మా ఇద్దరిని ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్( Lavanya Tripati Varun Tej Marriage ) గురించి మొదటిసారి చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా మిస్టర్ ( Mister ) సినిమాలో నటించారు.

ఈ సినిమా సమయం నుంచి ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ ఎక్కడ బయటపడకుండా జాగ్రత్త పడి చివరికి నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.ఇలా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం( VarunLav Engagement ) జరుపుకున్నటువంటి ఈ జంట ఇటలీలో పెళ్లి చేసుకున్నారు.అనంతరం హైదరాబాదులో సెలబ్రెటీల అందరిని ఆహ్వానించి ఘనంగా రిసెప్షన్ జరుపుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube