భారత్‌లో అతి తక్కువ ధరతో లాంచ్ అయిన 5జీ ఫోన్.. ఎంతంటే..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ లావా భారతదేశంలో 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,000 ధరకే రిలీజ్ చేస్తోంది.లావా బ్లేజ్ 5జీగా పిలిచే ఈ ఫోన్‌ను ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022లో రైల్వేలు, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ఆవిష్కరించారు.లావా బ్లేజ్ 5జీ ప్రీ-బుకింగ్స్‌ దీపావళి నాటికి ఓపెన్ అవుతాయని కంపెనీ తెలిపింది.2.2 GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేసే 7nm మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో వచ్చే ఈ మొబైల్ 4GB+ 3GB వర్చువల్ ర్యామ్‌ సాయంతో ల్యాగ్ ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తుంది.

 Lava Blaze 5g India's Most Affordable 5g Phone,lava Blaze, New Phone, 5g Phone,-TeluguStop.com

ఈ మొబైల్‌లో కాల్ రికార్డింగ్ ఫీచర్‌, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 50 ఎంపీ AI ట్రిపుల్ కెమెరా సెటప్, 8MP ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆఫర్ చేశారు.ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల HD+ IPS డిస్‌ప్లేతో పాటు Widevine L1 సపోర్ట్‌, 90 Hz రిఫ్రెష్ రేట్‌, సైడ్ మౌంటెడ్ అల్ట్రా-ఫాస్ట్ ఫింగర్ ప్రింట్ అన్‌లాక్‌ ఇటువంటి అద్భుతమైన ఫీచర్లను కూడా ఇచ్చారు.

భారతదేశంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి 5జీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.ఎయిర్‌టెల్ ఇప్పటికే పలు నగరాల్లో ఈ సేవలను అందించడం ప్రారంభించింది ఈ నేపథ్యంలో 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఆస్వాదించాలని భావిస్తారు.5జీ ఫోన్ త్వరగా కొనేయాలని ఆరాటపడుతున్నారు.అయితే 5జీ ఫోన్స్ అన్నీ కూడా ఇప్పుడు 15,000 పైగానే ధరలు పలుకుతున్నాయి.ఈ నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలు కూడా కొనుగోలు చేసే విధంగా పదివేల లోపు లావా కంపెనీ తీసుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube