లాఫింగ్ బుద్దా ఎలా ఉంటే… ఏం జరుగుతుందో తెలుసా?  

Laughing Buddha Meaning And Positions-

ఈ మధ్య కాలంలో చాలా మంది ఇళ్లలో లాఫింగ్ బుద్ధాను చూస్తున్నాం.అయితే ఒక్కొక్కరి ఇంటిలో ఒక్కొక్క విధంగా ఉండటం చూస్తున్నాం.లాఫింగ్ బుద్ధాను ఇంటిలో పెట్టుకున్నప్పుడు ఏ విధంగా పెట్టుకుంటే మంచి జరుగుతుందో చాలా మందికి తెలియదు.లాఫింగ్ బుద్ధాను తీసుకువచ్చి ఎవరికీ ఇష్టం వచ్చినట్టు ఆలా పెట్టేస్తూ ఉంటారు.

కానీ లాఫింగ్ బుద్ధాను ఏ విధంగా పెడితే సంపద కలిసొస్తుందో తెలుసుకుందాం.

Laughing Buddha Meaning And Positions- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) Laughing Buddha Meaning And Positions---

1.

చుట్టూ 5 మంది పిల్ల‌లు ఉన్న‌ట్టుగా ఉండే లాఫింగ్ బుద్ధా బొమ్మను ఇంటిలో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఇంటిలోకి వచ్చి అనుకున్న పనులు నెరవేరతాయి.

2.

పెద్ద సంచిలో నాణేల‌తో పాటు లాఫింగ్ బుద్ధా బొమ్మ పెడితే సంపద పెరగటమే కాకుండా ఆర్ధిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.

3.

చేతిలో రుద్రాక్ష వంటి మాల‌తో ఉన్న లాఫింగ్ బిడ్డను ఇంటిలో పెట్టుకుంటే అపారమైన తెలివితేటలు వస్తాయి.

4.

కూర్చొని ఉన్న లాఫింగ్ బుద్ధాను ఇంటిలో పెట్టుకుంటే జంటల మధ్య ప్రేమ,అన్యోన్యత పెరుగుతాయి.

5.

నిల్చొని ఉన్న లాఫింగ్ బుద్ధా ఇంటిలో పెడితే ధనం బాగా పెరుగుతుంది.

6.

చేతిలో విస‌న‌క‌ర్ర‌, సొర‌కాయ ఉన్న లాఫింగ్ బుద్ధా ఇంటిలో ఉంటే ఇంటిలోని వారికీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు.

7.

లాఫింగ్ బుద్ధా విగ్ర‌హం చేతిలో బౌల్ (పాత్ర‌)తో ఉంటే ఆ ఇంటిలో ఉత్సాహం,ఆనందం,సంతోషం ఉంటాయి.

8.

చేతిలో విస‌న‌క‌ర్ర‌తో లాఫింగ్ బుద్ధా కూర్చుని ఉంటే ఆ ఇంటిలో ఉన్న ఎటువంటి సమస్య అయినా ఇట్టే పరిష్కారం అవుతాయి.ఇంటిలో అందరు సుఖ సంతోషాలతో ఉంటారు.

DEVOTIONAL