పామును చూసిన వ్య‌క్తి ఒక్క‌సారిగా ఏం చేశాడో చూస్తే న‌వ్వులే..

Laugh When You See What The Person Who Saw The Snake Did At Once

మ‌నం ఏదైనా ఒక చోట ఉన్న‌ప్పుడు అక్క‌డ‌కు స‌డెన్ గా ఓ పాము వ‌చ్చింద‌నుకోండి ఇంకేమైనా ఉందా.ప్రాణాలు గాల్లోనే పోతాయి.

 Laugh When You See What The Person Who Saw The Snake Did At Once-TeluguStop.com

వెంట‌నే ఒక్క ఉదుట‌న దానికి దూరంగా జ‌రిగిపోతాం.అది ఎక్క‌డ కాటు వేస్తుందో అనే భ‌యంతో దానికి చిక్క‌కుండా త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాం.

అయితే కొంద‌రు మాత్రం పాముల‌ను చూసినా కూడా ఏ మాత్రం భ‌య‌ప‌డ‌రు.పైగా అదేదో అడుకునే వ‌స్తువు అన్న‌ట్టు దానితో ప‌రాచ‌కాలు ఆడుతారు కూడా.

 Laugh When You See What The Person Who Saw The Snake Did At Once-పామును చూసిన వ్య‌క్తి ఒక్క‌సారిగా ఏం చేశాడో చూస్తే న‌వ్వులే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలాంటి విభిన్న‌మైన పాముల‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో నిత్యం క‌నిపిస్తూనే ఉంటాయి.

ఇక ఇప్పుడు కూడా ఇలాంటి పాముకు సంబంధించిన వీడియోనే బాగా వైర‌ల్ అవుతోంది.

అయితే దాన్ని చూస్తే మాత్రం ప‌డి ప‌డి న‌వ్వుకుంటారు అంతే.ఎందుకంటే కొంద‌రు అత్యంత భ‌య‌స్తులు పాముల‌ను చూస్తే ఒక్క ఉదుట‌న కంగారు ప‌డిపోయే ఏదేదో చేస్తుంటారు.

ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట్లో తెగ చెక్క‌ర్లు కొడుతోంది.అయితే దీన్ని చూసిన వారంతా కూడా ఇదేం భ‌య‌ప‌డుడు బ్రో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

వైర‌ల్ వీడియోలో ఓ చోట కొంద‌రు ప‌నిచేయ‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.

కాగా వీరు ఇలా షిప్ డెక్ లో ప‌నిచేస్తున్న‌ప్పుడే అని మీకు అర్థ‌మవుతుంది.అయితే ఇక్క‌డ‌కు జరజరా పాకుతూ ఓ పాము ఎంట్రీ ఇచ్చింది.ఇక ప‌నిలో ఉన్న వారు ఒక్క‌సారిగాపామును చూసి భ‌య‌బ్రాంతుల‌కు గుర‌య్యారు.

అయితే ఇందులో వ్య‌క్తి మాత్రం భయంతో కేక‌లు వేస్తూ చిన్న పిల్లాడిలా వెనక్కి పరుగులు తీయ‌డం మ‌నం చూడొచ్చు.ఇక అత‌ని అరుపుల‌కు ఆ పాము కూడా బెదిరిపోయి అటు ఇటు ప‌రుగులు తీయడం మ‌నం చూడొచ్చు.

ఇక‌పోతే ఈ ఇద్ద‌రూ కూడా టామ్ అండ్ జెర్రీ లాగా ఒకరిని చూసి ఒక‌రు బెదిరిపోతారు.

#Fears #Snake #Snake #Netizens #Snake

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube