KGF సినిమాతో స్టార్ డైరెక్టర్ గా నేషనల్ లెవెల్లో క్రేజ్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం KGF సెకండ్ పార్ట్ తో సిద్దమవుతున్న సంగతి తెలిసిందే.అయితే ఇంకా ఆ సినిమా పనులు ముగించకముందే మరో ప్రాజెక్ట్ ని సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు.
నెక్స్ట్ ఎన్టీఆర్ తో వర్క్ చేయడానికి ఈ యువ దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
గత కొంత కాలంగా ఈ వార్త వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.అయితే ఆ సినిమాలో ఎన్టీఆర్ ఫుల్ ఎనర్జీ స్క్రీన్ పై కనిపిస్తుందని సమాచారం.పూర్తిగా సినిమా డ్యాన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందట.
అంటే ఎన్టీఆర్ కెరీర్ లో మొదటిసారి ఒక ఫుల్ డ్యాన్సర్ గా కనిపించనున్నాడు.ఎన్టీఆర్ స్టైల్ కి తగ్గట్టే దర్శకుడు స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్లు టాక్.
KGF సెకండ్ పార్ట్ ఎండ్ అయ్యేలోపు ఎన్టీఆర్ కూడా RRR షూటింగ్ ని ఫినిష్ చేస్తాడు.అనంతరం ఏ ప్రాజెక్ట్ అనేది ఇంకా డిసైడ్ కాలేదు.ప్రశాంత్ నీల్ స్క్రిప్ లో క్లయిమ్యాక్స్ ని చేంజ్ చేసి ఫినిషింగ్ టాచ్ ఇచ్చి మరోసారి తారక్ కి వినిపిస్తాడట.జూనియర్ కి నచ్చితే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా గ్రాండ్ గా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
.