బ్రేకింగ్‌ : అల్లు అర్జున్‌ ఎర్ర చందనం స్మగ్లింగ్‌

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘అల వైకుంఠపురంలో’ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్‌ చేయబోతున్న సినిమాకు సుకుమార్‌ దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే.

 Latestupdate Of Alavaikuntapuramlo-TeluguStop.com

ఆ సినిమాలో అల్లు అర్జున్‌ పాత్ర ఏంటీ ఎలా కనిపించబోతున్నాడు అనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతుంది.రంగస్థలం చిత్రంతో దర్శకుడిగా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న సుకుమార్‌ ఈ చిత్రాన్ని చాలా విభిన్నంగా తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నాడట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఎక్కువ శాతం అడవి నేపథ్యంలోనే ఉంటుందట.పల్లెటూరి కుర్రాడి పాత్రలో బన్నీ కనిపిస్తాడట.ఎర్ర చందనం స్మగ్లింగ్‌ చేసే లారీ డ్రైవర్‌గా బన్నీ కనిపిస్తాడని సమాచారం అందుతోంది.మొదట సంఘ విద్రోహక శక్తిగా ఉండే బన్నీ ఆ తర్వాత పోలీసులకు అనుకూలంగా మారి పెద్ద తలకాయలను ప్రభుత్వానికి పటిస్తాడట.

 Latestupdate Of Alavaikuntapuramlo-బ్రేకింగ్‌ : అల్లు అర్జున్‌ ఎర్ర చందనం స్మగ్లింగ్‌-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే ఈ సినిమా కోసం ఒక విభిన్నమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.అతి త్వరలోనే దాన్ని ప్రకటించబోతున్నారు.

#LatestUpdate #StylishStar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు