తనపై రేప్ జరిగిందంటున్న అర్జున్ రెడ్డి శివ... 

టాలీవుడ్ లో  ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ నటించినటువంటి అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన అటువంటి శివ పాత్ర అందరికీ చాలా బాగా గుర్తుంటుంది.దీంతో పాటూ ఆ పాత్రలో నటించిన రాహుల్ రామకృష్ణ కూడా తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తు ఉంటాడు.

 Latestnews About Tollywoodactor Rahul Rama Krishna-TeluguStop.com

అయితే అర్జున్ రెడ్డి సినిమాలో రాహుల్ కృష్ణ నటించింది హీరో ఫ్రెండ్ పాత్రలోనే అయినా గొప్ప గొప్ప స్టార్ల సినిమాల్లో నటించే అవకాశాలను అనతికాలంలోనే దక్కించుకొని ఔరా అనిపించాడు.

అయితే తాజాగా రాహుల్ రామకృష్ణ తన జీవితంలో జరిగినటువంటి ఓ విషాదకర సంఘటనని తన అభిమానులతో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా తనపై చిన్నప్పుడు అత్యాచారం జరిగిందని తన బాధను ఎవరితో పంచుకోవాలో తెలియలేదని వాపోయాడు రాహుల్ రామకృష్ణ.అంతేగాక తనపై జరిగిన ఈ అఘాయిత్యం గురించి ఇతరులతో పంచుకోవడం వలన తానంటే ఏంటో తనకు బాగా తెలుస్తుందని అంటున్నాదు.

అంతేగాక ఆ విషయం తను చాలా బాధించిందని పేర్కొన్నారు.

Telugu Rahulrama-Movie

ఈ విషయంపై నెటిజన్లు స్పందిస్తూ తమ సపోర్ట్ ని రాహుల్ రామకృష్ణకి తెలియజేస్తున్నారు.అంతేగాక ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ పలు విషాదకర సంఘటనలు ఉంటాయని ఆ సంఘటనను మరిచిపోయి తమ జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు ప్రయత్నాలు చేయాలని ఇలా చేస్తేనే భవిష్యత్తు చాలా బాగుంటుందని ధైర్యం చెబుతున్నారు. అయితే ఇప్పటికే రాహుల్ రామకృష్ణ మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించి ప్రేక్షకులను తనదైన శైలిలో మెప్పించాడు.

అంతేగాక ఇప్పటికే పలు పెద్ద చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube