'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా గురించి చాలా పెద్ద ఇంట్రెసింగ్‌ న్యూస్‌  

Latest Update Of Rrr Movie-aliabhat,full Action Fights,no Love S,ntr,rajamouli,ramcharan,rrr,three Emotional S

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ప్రస్తుతం బల్గేరియాలో చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంకు జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు.దానయ్య దాదాపుగా 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందబోతుంది.అందుకు సంబంధించిన ప్రకటన ఇప్పటికే అధికారికంగా జక్కన్న చేశాడు.అల్లూరి పాత్రలో చరణ్‌, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్‌ కనిపించబోతున్నారు.ఇక ఈ చిత్రం గురించిన మరో ఆసక్తికర విషయం ఒకటి ఫిల్మ్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

Latest Update Of Rrr Movie-aliabhat,full Action Fights,no Love S,ntr,rajamouli,ramcharan,rrr,three Emotional S-Latest Update Of RRR Movie-Aliabhat Full Action Fights No Love Songs Ntr Rajamouli Ramcharan Rrr Three Emotional

Latest Update Of Rrr Movie-aliabhat,full Action Fights,no Love S,ntr,rajamouli,ramcharan,rrr,three Emotional S-Latest Update Of RRR Movie-Aliabhat Full Action Fights No Love Songs Ntr Rajamouli Ramcharan Rrr Three Emotional

ఇది ఒక పీరియాడిక్‌ చిత్రం అవ్వడం వల్ల రాజమౌళి మరీ కమర్షియల్‌గా ఈ చిత్రాన్ని మరల్చాలని భావించడం లేదు.ఎందుకంటే సినిమా చాలా ఎమోషన్స్‌తో మరియు యాక్షన్‌ సీన్స్‌తో ఉంటుందట.ఈ చిత్రంలో రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల్లో ఉండే విధంగా పాటలు మరియు కామెడీ సీన్స్‌ ఉండవని అంటున్నారు.సందర్బానుసారంగా వచ్చే మూడు పాటలు మినహా డ్యూయెట్‌లు, లవ్‌ సాంగ్స్‌, హీరోయిన్‌ హాట్‌ సాంగ్స్‌ ఉండవని సమాచారం అందుతోంది.

బాహుబలి చిత్రంలో రొమాటిక్‌ సాంగ్స్‌తో పాటు లవ్‌ సాంగ్‌ కూడా జక్కన్న పెట్టాడు.కాని ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ లో మాత్రం అలా పెట్టేందుకు సిద్దంగా లేడని సమాచారం అందుతోంది.కేవలం మూడు పాటలను అది కూడా ఒక మామూలు సిచువేషనల్‌ సాంగ్స్‌ గా మాత్రమే పెట్టబోతున్నట్లుగా అనుకుంటున్నారు.

రామ్‌ చరణ్‌కు జోడీగా ఆలియా భట్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.వచ్చే ఏడాది జులై చివర్లో విడుదల కాబోతున్న ఈ చిత్రం వెయ్యి కోట్ల టార్గెట్‌ను రీచ్‌ అవుతుందనే నమ్మకంతో యూనిట్‌ సభ్యులు ఉన్నారు.