'ఆదిపురుష్''లో ప్రభాస్ పాత్రపై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయినా విషయం తెలిసిందే.ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెట్టాడు.

 Latest Update On Hero Prabhas Adipurush Movie Shoot, Prabhas, Adipurush, Om Rau-TeluguStop.com

ఒకేసారి మూడు సినిమాలు సెట్స్ మీదకు తీసుకు వెళ్లి అన్ని సినిమాల షూటింగ్ ను బాలన్స్ చేస్తూ ప్రభాస్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.ప్రెసెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ”ఆదిపురుష్” సినిమా ఒకటి.

ఆదిపురుష్ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల బడ్జెట్ తో భారీ విజువల్ గ్రాఫిక్స్ తో తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.సన్నీ సింగ్ లక్ష్మణ పాత్రలో నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 45 శాతం పూర్తి చేసుకుంది.ఈ నేపథ్యంలో ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ షూట్ పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.

Telugu Aadipurush, Adipurush, Om Raut, Pan India, Prabhas, Prabhasramudu, Radhe

ఈ సినిమాలో మిగతా వారి పాత్రల కన్నా ప్రభాస్ పాత్ర చాలా కీలకం.తను ఒక్కడే ఈ సినిమాను ముందు ఉండి నడిపించాలి.అందుకే ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి రోజురోజుకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది.

Telugu Aadipurush, Adipurush, Om Raut, Pan India, Prabhas, Prabhasramudu, Radhe

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.ఈ సినిమాలో ప్రభాస్ దాదాపు 60 రోజుల పాటు రాముడు గెటప్ లో ఉంటారట.ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలో రాముడి గొప్పతనం, ఔనత్యం కనిపించేలా ఈ సినిమాను తీర్చి దిద్దుతున్నారు.

అందుకే ఈ సినిమాలో రాముడి పాత్ర కీలకం.రాముడిలో ఉన్న ప్రతి అంశాన్ని యుద్ధ విన్యాసాల్లో రాముడి తెగువను కళ్ళకు కట్టినట్టు చూపించి ఈ సినిమాకి రాముడి పాత్రనే హైలెట్ చేయబోతున్నారని టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube