భీమ్లా నాయక్ కు కూడా రెండు రిలీజ్ డేట్లు ఉన్నాయా?

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ‘భీమ్లా నాయక్’ ఒకటి.టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి తో కలిసి పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

 Latest Update On Pawan Kalyan Bheemla Nayak Release Date Details, Pawan Kalyan, Bheemla Nayak, Release Date , Rana Daggubati, Aishwarya Rajesh, Nithya Menon, Director Sagar K Chandra, Chiranjeevi, Acharya-TeluguStop.com

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్నట్టు సమాచారం.

ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 Latest Update On Pawan Kalyan Bheemla Nayak Release Date Details, Pawan Kalyan, Bheemla Nayak, Release Date , Rana Daggubati, Aishwarya Rajesh, Nithya Menon, Director Sagar K Chandra, Chiranjeevi, Acharya-భీమ్లా నాయక్ కు కూడా రెండు రిలీజ్ డేట్లు ఉన్నాయా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పాటలు, పోస్టర్స్, గ్లిమ్స్ అన్ని కూడా ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అవ్వాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల వాయిదా వేశారు మేకర్స్.

ఆ తర్వాత భీమ్లా నాయక్ కొత్త రిలీజ్ డేట్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాను ఫిబ్రవరి 25న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

అయితే ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా రిలీజ్ డేట్ పై లేటెస్ట్ టాక్ ఒకటి వినిపిస్తుంది.ఈ సినిమాకి కూడా రెండు రిలీజ్ డేట్లు పరిశీలనలో ఉన్నాయట.

Telugu Acharya, Bheemla Nayak, Chiranjeevi, Sagar Chandra, Latestbheemla, Nithya Menon, Pawan Kalyan, Rana Daggubati-Movie

ముందుగా ఫిబ్రవరి 25న కాగా మరొకటి ఏప్రిల్ 1న అని తాజాగా వస్తున్న సమాచారం.అయితే ఆల్రెడీ ఏప్రిల్ 1న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా కూడా రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.మరి ఇదే కనుక నిజమైతే పవన్ అన్నయ్యకు పోటీ వస్తాడా అనే సందేహం ఉన్నప్పటికీ రిలీజ్ డేట్ పై మరొకసారి క్లారిటీ కావాలని పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Telugu Acharya, Bheemla Nayak, Chiranjeevi, Sagar Chandra, Latestbheemla, Nithya Menon, Pawan Kalyan, Rana Daggubati-Movie

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే- డైలాగ్స్ అందిస్తున్నాడు.ఇందులో పవన్ కు జోడీగా నిత్యా మీనన్, రానా దగ్గుబాటి కి జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube