బాలయ్య-అనిల్ కాంబోపై లేటెస్ట్ ఎగ్జైటింగ్ అప్డేట్ ఇదే!

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా విజయం తర్వాత మరొక మాస్ డైరెక్టర్ ను లైన్లో పెట్టాడు. క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాను స్టార్ట్ చేసాడు.

 Latest Update On Balayya Anil Ravipudi S Film, Anil Ravipudi , Balakrishna , Gop-TeluguStop.com

 ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్.

ఇందులో బాలయ్య చెప్పిన డైలాగ్స్ కి అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేసాయి.

ఈ సినిమా పులిచర్ల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా అని టీజర్ ద్వారా గోపీచంద్ చెప్పకనే చెప్పాడు.

మైత్రి మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ యువ దర్శకుడు హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తన 108 వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

Telugu Anil Ravipudi, Balakrishna, Latestbalayya, Nbk, Priyamani, Shruti Haasan,

ఇటీవలే అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్ 3’ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది.ఇక ఇప్పుడు అనిల్ బాలయ్య సినిమాపై ఫోకస్ పెట్టాడు.త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.ప్రెసెంట్ అనిల్ ఈ సినిమా స్క్రీన్ ప్లే ను తన టీమ్ తో కలిసి రూపొందిస్తున్నారట.

Telugu Anil Ravipudi, Balakrishna, Latestbalayya, Nbk, Priyamani, Shruti Haasan,

మరొక వారం రోజుల్లో ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం పూర్తి అవుతుంది.ఆగష్టు లో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు రావడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.ఇది పక్కన పెడితే ఈ సినిమాలో బాలయ్య 50 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి పాత్రలో కనిపించనున్నారని కూతురు పాత్రలో శ్రీలీల కనిపించనుందని.హీరోయిన్ గా ప్రియమణి అని వార్తలు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube