విక్రమ్‌ ఒక పక్కకు ఒరిగి ఉంది  

Latest Update Of Vikram Lander-moon Landing Crash,orbital In Sequel Getting Signal From Vikram,vikram Lander

చంద్రయాన్‌ 2 ద్వారా చంద్రుడిపై ప్రయోగించిన విక్రమ్‌ ల్యాండర్‌ ప్రయోగం చివరి నిమిషంలో విఫలం అయిన విషయం తెల్సిందే.అంతా సజావుగా సాగుతుందని భావించిన తరుణంలో హఠాత్తుగా విక్రమ్‌ల ల్యాండర్‌ నుండి సంకేతాలు తెగి పోయాయి.

Latest Update Of Vikram Lander-moon Landing Crash,orbital In Sequel Getting Signal From Vikram,vikram Lander-Telugu Trending Latest News Updates-Latest Update Of Vikram Lander-Moon Landing Crash Orbital In Sequel Getting Signal From Lander

దాంతో ప్రయోగంలో పాల్గొన్న ప్రతి ఒక్క శాస్త్రవేత్త కూడా కన్నీరు పెట్టుకున్నారు.దేశం మొత్తం వారికి మద్దతుగా నిలిచింది.విక్రమ్‌ను వదిలేయని శాస్త్రవేత్తలు ఆర్బిటాల్‌ ద్వారా దాన్ని గుర్తించారు.చంద్రుడిపై అది ల్యాండ్‌ అయ్యిందని నిర్ధారించారు.

అయితే చంద్రుడిపై విక్రమ్‌ క్రాష్‌ ల్యాండింగ్‌ అయ్యి ఉంటుందని మొదట భావించారు.

తాజాగా ఆ విషయమై నిర్ధారించింది.క్రాష్‌ ల్యాండింగ్‌ అయినా కూడా విక్రమ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నారు.క్రాష్‌ ల్యాండింగ్‌ కారణంగా విక్రమ్‌ విచ్చిన్నం కాలేదు, కాని ఒక పక్కకు ఒరిగి ఉన్నట్లుగా గుర్తించారు.

విచ్చినం అవ్వని కారణంగా ఇంకా దాని నుండి సిగ్నల్స్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.దీని కాలపరిమితి 14 రోజులు కనుక అప్పటి వరకు ప్రయత్నాలు సాగుతాయి.

ఇప్పటికే నాలుగు రోజులు పూర్తి అయ్యింది.మరో 10 రోజుల పాటు ప్రయత్నాలు సాగించే అవకాశం ఉంది.

తాజా వార్తలు