యాదాద్రి ఎంత వరకు వచ్చింది?  

Latest Update Of Telangana Yadadri Temple-laxmi Narasimha Swamy Temple,new Technology,telangana Cm Kcr,yadadri Temple

తెలంగాణలోనే అత్యంత ప్రసిద్దమైన శ్రీ యాదగిరి లక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం పునర్‌నిర్మాణ కార్యక్రమం గత అయిదు సంవత్సరాలుగా సాగుతూనే ఉంది.మొదట రెండేళ్లలో పూర్తి అవుతుందన్నారు.

Latest Update Of Telangana Yadadri Temple-laxmi Narasimha Swamy Temple,new Technology,telangana Cm Kcr,yadadri Temple Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి )-Latest Update Of Telangana Yadadri Temple-Laxmi Narasimha Swamy Temple New Technology Telangana Cm Kcr

ఆ తర్వాత అయిదు సంవత్సరాలు అన్నారు.ఇప్పుడు ఏకంగా ఆరు సంవత్సరాలు కావస్తుంది.

ఇప్పటికి పూర్తి కాలేదు.అత్యుత్తమంగా నిర్మాణం జరపాలనే ఉద్దేశ్యంతో కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు అనుకుని తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్మాణాలను చేపడుతోంది.

ఆలయం పూర్తిగా తొలగించి మూల విరాట్‌ స్థానంలో కొత్త గుడి కట్టడంతో పాటు గుట్ట పైన మరియు గుట్ట కింద అత్యుత్తమమైన రోడ్లు నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఆలయం పూర్తిగా మారి పోతుంది.

పాత ఆలయ స్వరూపం అంతా కూడా మారిపోతుంది.అత్యంత విభిన్నంగా ఆలయాన్ని నిర్మిస్తున్నట్లుగా చెబుతున్నారు.

తిరుపతి స్థాయిలో ఆలయాన్ని డెవలప్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ కంకణం కట్టుకున్నారు.దేశంలోనే అతి ప్రఖ్యాతి గాంచిన లక్ష్మి నరసింహస్వామి దేవాలయంగా యాదగిరి గుట్టకు పేరుంది.

అందుకే యాదాద్రిని ప్రపంచ స్థాయి ఆర్కిటెక్చర్స్‌తో డిజైన్‌ చేయిస్తున్నారు.2020లో ఆలయం పూర్తి అవ్వడం కన్ఫర్మ్‌ అంటూ అధికారులు చెబుతున్నారు.