వినండి రా బాబు..!  చనిపోయింది నేను కాదంటున్న నటి...

తాజాగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నటువంటి బుల్లితెర నటి సేజల్ శర్మ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఆత్మహత్య చేసుకున్న నటి పేరుతోనే మరో నటి ఉండటంతో ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

 Latest Update Of Sezal Sharma-TeluguStop.com

అంతేగాక చనిపోయింది ఒకరైతే సంతాపం ఇంకొకరికి తెలియజేస్తున్నారు నెటిజన్లు.దీంతో బ్రతికి ఉన్నటువంటి సెజల్ శర్మ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పష్టత ఇచ్చారు.

ఇందులో భాగంగా నా స్నేహితులకు మరియు అభిమానులకు ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నానని నేను ప్రస్తుతం బాగానే ఉన్నానని చనిపోయినటువంటిసేజల్ శర్మకు సంతాపం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.అంతేకాక కొన్ని మీడియా వెబ్ సైట్లు చనిపోయిన టువంటి సేజాల్ శర్మ ఫోటో బదులుగా బ్రతికి ఉన్నటువంటి నా ఫోటోలను వాడుతున్నారని దీంతో బంధువులు మరియు సన్నిహితులు తమ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుతున్నారని కాబట్టి తన ఫోటోని తొలగించాలని మీడియా ప్రతినిధులను కోరారు.

Telugu Bollywood, Bollywoodsezal, Sejal Sharma-Movie

అయితే ఇది ఇలా ఉండగా చనిపోయినటువంటి సేజల్ శర్మ కుటుంబ సభ్యులను విచారించగా ఆమెకి ఎటువంటి ఆర్థిక పరమైన సమస్యలు గాని ప్రేమ సంబంధిత సమస్యలు గానీ లేవని అన్నారు.కానీ  సేజల్ శర్మ ఇలా ఆత్మహత్య ఎందుకు చేసుకుందో అర్థం కావడం లేదని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube