వీరికి పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? లేదా?

నయనతార, విఘ్నేష్‌ శివన్‌ లు దాదాపుగా అయిదు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు.మొదట్లో వీరు కనీసం కలిసి బయటకు వెళ్లే వారు కాదు.

 Latest Update Of Naayanatara And Vignesh Shivan Marriage, Nayanatara, Vignesh Sh-TeluguStop.com

కాని రోజులు గడిచినా కొద్ది వారు తమ ప్రేమ విషయాన్ని మెల్లగా అందరికి తెలియజేశారు.ఈ విషయంలో ఇప్పుడు అంతా క్లారిటీగా ఉంది.

ఇద్దరు ప్రేమలో పీకల్లోతు మునిగి ఉన్నారు.అలాగే వీరిద్దరు గత కొన్నాళ్లుగా సహజీవనం సాగిస్తున్నారు.

ఈ రెండు విషయాలపై ఎలాంటి డౌట్‌ లేదు.వారు కూడా ఇప్పటికే ఈ విషయాలను క్లారిటీ ఇచ్చారు.

పెళ్లి విషయంలో మాత్రం వీరిద్దరు నాన్చుతూ వస్తున్నారు.గత రెండు సంవత్సరాలుగా నయన్‌ విఘ్నేషన్‌ ల వివాహం గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి.అతి త్వరలో వీరి వివాహం ఉంటుంది అనేది చాల మంది వాదన.అయితే అసలు విషయం ఏంటీ అంటే వీరిద్దరు ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా లేరు.

తాజాగా నయన్‌ ప్రియుడు దర్శకుడు అయిన విఘ్నేష్‌ శివన్‌ పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చాడు.అతడి మాటలను బట్టి చూస్తుంటే వీరికి పెళ్లి విషయంలో అసలు ఆసక్తి ఉందా లేదా అనే అనుమానం కలుగక మానదు.

ఇంతకు విఘ్నేష్‌ ఏమన్నాడంటే.మేము ఇద్దరం ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాం.అలాగే కెరీర్‌ పరంగా కూడా ఇద్దరం చాలా మంచి స్థితిలో ఉన్నాం.ఈ సమయంలో మా ఇద్దరికి కొన్ని కలలు గోల్స్‌ ఉన్నాయి.

వాటిని నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.మాకు పెళ్లి విషయంలో ఇప్పుడు ఆలోచన లేదు అన్నాడు.

ప్రియుడిగా నయన్‌ గోల్స్‌ సాధనలో నేను ఆమెకు సాయం చేయాలనుకుంటున్నాను.అందుకే పెళ్లి విషయాన్ని ఇప్పుడే తీసుకు రావాలనుకోవడం లేదు అన్నాడు.

అందుకే వీరికి పెళ్లి ఆలోచన లేదా ఏంటీ అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube