తమిళనాడుకు కియా వార్తలపై క్లారిటీ

చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ప్రముఖ కార్ల తయారి సంస్థ కియా ఏపీలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.ఇప్పటికే అక్కడి నుండి కార్ల తయారి ప్రారంభం అయ్యింది.

 Latest Update Of Kia Shift In Tamilanadu-TeluguStop.com

ఈ సమయంలో ఏపీలో ఉన్న పరిస్థితుల కారణంగా కియా కార్ల కంపెనీ అక్కడ నుండి తమిళనాడుకు షిఫ్ట్‌ కాబోతున్నట్లుగా ఒక అంతర్జాతీయ మీడియా సంస్థలో కథనం వచ్చింది.కియా కారు ఉత్పాదకాలు బాగానే ఉన్న స్థానిక పరిస్థుతులు కంపెనీపై ప్రభావం చూపుతున్నాయంటూ ఆ కథనంలో పేర్కొన్నారు.

కియా ప్లాంట్‌ తరలింపుపై మీడియాలో వచ్చిన వార్తలపై ఆ సంస్థ ప్రతినిధి స్పందించారు.అదో చెత్త ఊహాగాణపు వార్త అంటూ కొట్టి పారేశాడు.తమకు అలాంటి ఉద్దేశ్యం లేదన్నాడు.110 కోట్ల డాలర్ల విలువైన ఈ ప్లాంట్‌ను మార్చే ఆలోచన తమకు లేదంటూ పేర్కొన్నాడు.అలాంటి ఊహాగాణలు రాసేప్పుడు కాస్త ఆలోచించాలని, అదే సమయంలో సంప్రదించాలంటూ ఆయన పేర్కొన్నారు.ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం నుండి కూడా ఆ కథనంపై స్పందన వచ్చింది.

కియా తరలింపు అంటూ వచ్చిన వార్త నిజం కాదని ఏపీలో కియా ప్లాంట్‌కు అవసరం అయిన అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందంటూ ప్రభుత్వం తరపున అధికారి స్పందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube