లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అల్లు అర్జున్ డాన్స్ కొరియోగ్రాఫర్

తెలుగులో ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా నటించిన టువంటి ఏబిసిడి చిత్రంలో గోపి పాత్రలో నటించినటువంటి గణేష్ ఆచార్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.అయితే తాజాగా గణేష్ ఆచార్య ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

 Latest Update Of Ganesh Acharya-TeluguStop.com

వివరాల్లోకి వెళితే ప్రస్తుతం గణేష్ ఆచార్య పలు సినిమాలు మరియు టెలివిజన్ కార్యక్రమాలతో బిజీ బిజీ షెడ్యూల్ తో గడుపుతున్నాడు.అయితే ఈ క్రమంలో ఇతడికి పర్సనల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్నాడని మరియు రోజు తనకు శృంగార తరహా సినిమాలను చూపిస్తూ తన లైంగిక వాంఛను తీర్చాలంటూ వేధిస్తున్నాడని ఆరోపిస్తోంది.

అంతేగాక ఈ విషయమై ఆ మహిళ ముంబైలోని మహిళా పోలీసులను ఆశ్రయించింది.

Telugu Ganesh Acharya, Ganeshacharya-Movie

దీంతో బాధితురాలు తెలిపిన టువంటి వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్నటువంటి మహిళా పోలీసులు గణేశ్ ఆచార్య విచారణ నిమిత్తమై పోలీస్ స్టేషన్ కి హాజరు కావాలని ఉత్తర్వులు కూడా జారీ చేశారు.అయితే ఇది ఇలా ఉండగా ఇలా లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడం గణేశ్ ఆచార్య కొత్తేమీ కాదు.ఇప్పటికే పలువురు సహ కొరియోగ్రాఫర్లు కూడా గణేష్ ఆచార్య ప్రవర్తనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అంతేగాక గతంలో మీటూ ఉద్యమానికి తెర లేపిన ఎటువంటి తనుశ్రీ దత్తా కూడా గణేశ్ ఆచార్య పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.తన పేరు మరియు పలుకుబడిని ఉపయోగించి కొత్తగా వచ్చేటువంటి డాన్సర్లను అవకాశాల పేరుతో వాడుకున్నాడని గణేష్ ఆచార్య పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube