భీష్మ : వచ్చిన పబ్లిసిటీ, సక్సెస్‌ చాలదా వివాదం ఎందుకు?  

Latest Update Of Bheeshma Publicity Issue - Telugu Bheeshma, Bheeshma Tittle Issue, Bheeshma Unit Comments On Worest Publicty Issue Of Bheeshma, Nithin And Rashmikha Mandhana, Nithin Bheeshma, Srinivasa Kalyanam And Bheeshma

నితిన్‌ హీరోగా రష్మిక హీరోయిన్‌గా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ‘భీష్మ’ చిత్రం మంచి సక్సెస్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే.ఈ సినిమా విడుదలకు ముందు టైటిల్‌ విషయమై వివాదం వచ్చింది అంటూ ప్రచారం జరిగింది.

Latest Update Of Bheeshma Publicity Issue - Telugu Tittle Unit Comments On Worest Publicty Nithin And Rashmikha Mandhana Srinivasa Kalyanam

అయితే ఆ వివాదం మరింత సీరియస్‌ అవ్వలేదు.విడుదలకు ముందు ఎలాంటి వివాదం అయితే కనిపించలేదు.

కాని ఇప్పుడు అనూహ్యంగా సినిమాకు సంబంధించిన వివాదం అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

భీష్మ టైటిల్‌ను ఎలా ఉపయోగిస్తారంటూ ఒక వర్గం వారు చిత్ర నిర్మాత ఆఫీస్‌ ముందు ఆందోళనకు దిగారట.సినిమా విడుదలై వారం కావస్తుంది.ఇలాంటి సమయంలో ఎందుకు ఈ వివాదం అంటూ అంతా అవాక్కవుతున్నారు.

సినిమా సక్సెస్‌ అయిన నేపథ్యంలో సదరు ఆందోళనకారులు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారంటూ కొందరు కామెంట్స్‌ చేస్తుండగా, కొందరు మాత్రం చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ పిచ్చి పబ్లిసిటీ చేస్తున్నారేమో అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నితిన్‌ కెరీర్‌లో అఆ చిత్రం తర్వాత అంతటి సూపర్‌ హిట్‌గా ఈ చిత్రం నిలుస్తుందని చెప్పుకోవచ్చు.బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న నితిన్‌కు ఇంకా సక్సెస్‌ కావాలా, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్‌ వస్తుంటే ఇలా చీప్‌గా పబ్లిసిటీ చేసేందుకు ప్రయత్నాలు ఎందుకు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.కాని చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం వివాదం గురించి మాట్లాడేందుకు ఆసక్తి చూపించడం లేదు.

మొత్తానికి భీష్మకు అయితే మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.

తాజా వార్తలు