భార్యను హింసించి దారుణంగా కొట్టిన తమిళ టీవీ నటుడు,అరెస్ట్  

Latest Update News About Iswar Raghunathan-iswar Raghunathan,jayasri Lady Dance Master,tamil Dance Master

టీవీ నటులు నటించేటప్పుడు ఎలా ముఖానికి రంగులు పూసుకుంటారో వారి నిజ జీవితంలో కూడా అలాగే రంగులు పూసుకొని నటిస్తూ ఉంటారు.చూడడానికి చాలా డీసెంట్ గా కనిపించే నటులు తమ నిజ జీవితంలో ఎలా ఉంటారు అన్న విషయాన్ని మాత్రం ఏ మాత్రం ఊహించలేము.తాజాగా ఒక తమిళ టీవీ నటుడు తన భార్యపై దాడి చేసినట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ కూడా చేసినట్లు తెలుస్తుంది.వివరాల్లోకి వెళితే….తమిళ టీవీ నటుడు ఐశ్వర్ రఘునాథన్, ఆతని భార్య జయశ్రీ కూడా ఒక డాన్స్ మాస్టర్ గా చేస్తుంది.

Latest Update News About Iswar Raghunathan-iswar Raghunathan,jayasri Lady Dance Master,tamil Dance Master Telugu Viral News Latest Update News About Iswar Raghunathan-iswar Raghunathan Jayasri Lady Da-Latest Update News About Iswar Raghunathan-Iswar Raghunathan Jayasri Lady Dance Master Tamil

అయితే వివాహమైన వీరిద్దరూ కూడా చెన్నైలోని తిరువాన్మయూర్, ఎల్‌బీ రోడ్డులో నివాసం ఉంటున్నారు.అయితే కొంతకాలం క్రితం, జయశ్రీకి సంబందించిన కొన్ని ఆస్తులకు సంబంధించిన పత్రాలను భర్త ఐశ్వర్‌ తీసుకొని తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తుంది.అయితే ఆ పత్రాలను విడిపించే విషయంలో ఇద్దరూ తరచూస్తో గొడవ పడుతూ ఉండేవారట.

ఈ క్రమంలో శనివారం కూడా ఇద్దరూ ఇదే విషయంపై గొడవ పడుతండడం తో ఇద్దరి మధ్య వాగ్వివాదం పెరిగి ఆగ్రహానికి గురైన ఐశ్వర్, తన కోపాన్ని నియంత్రించలేక తన భార్యను దారుణంగా కొట్టాడు.

దీంతో ఆమె గాయాలతో అడయార్ ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో చేరింది.భర్తపై మహిళా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ చేసి, ఐశ్వర్‌ రఘునాథన్‌ ను, అతని తల్లిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.