రేణు దేశాయ్‌ సినిమా పనులు ఎంత వరకు వచ్చాయంటే..!  

Latest Update about renudesai making movie renudesai, goreti venkanna, sakshi tv, farmmars movie - Telugu Farmmars Movie, Goreti Venkanna, Renudesai, Sakshi Tv

పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య.గతంలో హీరోయిన్‌ గా నటించిన రేణు దేశాయ్‌ తెలుగు సినిమా పరిశ్రమలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారు.ఆమె ఇప్పటికే బుల్లి తెరపై సందడి చేశారు.త్వరలో వెండి తెరపై కూడా కనిపించాలని భావిస్తున్నారు.మంచి పాత్రతో సంప్రదిస్తే తప్పకుండా నటించేందుకు రెడీగా ఉన్నాను అంటూ ఆమె గతంలోనే ప్రకటించింది.ఒక వైపు నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన రేణు దేశాయ్‌ మరో వైపు ఆమె స్వీయ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు రెడీ అవుతోంది.

TeluguStop.com - Latest Update About Renudesai Making Movie

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఆమెకు రైతులు అంటే చాలా ఇష్టం.ఆ ఇష్టంతోనే రైతుల సమస్యలపై ఒక సినిమాను తీసేందుకు సిద్దం అయ్యింది.

TeluguStop.com - రేణు దేశాయ్‌ సినిమా పనులు ఎంత వరకు వచ్చాయంటే..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ సినిమాను చాలా రోజుల క్రితం ప్రకటించింది.అయితే ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ లేక పోవడంతో అసలు సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

గతంలో సాక్షి టీవీ కోసం ఒక రైతు వారి ప్రోగ్రాంను చేసిన రేణు దేశాయ్‌ ఇప్పుడు సినిమాను చేసేందుకు సిద్దం అయ్యింది.అందుకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ను జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉండేలా రైతు సినిమాను తీస్తున్నట్లుగా ఆమె చెబుతోంది.తాజాగా ఈ సినిమా కోసం పాటలను గోరేటి వెంకన్నతో రాయించేందుకు రెడీ అయ్యింది.

తాజాగా రేణు దేశాయ్‌ గోరేటి వెంకన్న ఫామ్‌ హౌస్‌కు వెళ్లి అక్కడ ఆయనతో పాటలు రాయించుకున్నారు.ఆ సందర్బంగా గోరేటి వెంకన్న భార్య వండిన మట్టి పాత్రల అన్నం మరియు పప్పును అరటి ఆకులో తిని వారికి కృతజ్ఞతలు చెప్పింది.

వీడియో మరియు ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.చిన్న బడ్జెట్‌ తో రేణు దేశాయ్‌ చేయబోతున్న ఈ సినిమాకు సంబంధించి వచ్చ ఏడాది షూటింగ్‌ ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు.

త్వరలోనే సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది.ఈ సినిమా అవార్డు విన్నింగ్‌ మూవీగా నిలుస్తుందంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు.రైతుల గురించి సినిమా తీయాలనే ఆలోచన రావడం నిజంగా అభినందనీయం అంటూ రేణు దేశాయ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

#Goreti Venkanna #RenuDesai #Sakshi Tv

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Latest Update About Renudesai Making Movie Related Telugu News,Photos/Pics,Images..