శ్రీరెడ్డి ఈసారి తమిళ స్టార్‌ హీరోపై బాంబు వేసింది   Latest Sri Reddy Leaks On Tamil Star Hero     2018-10-29   15:24:44  IST  Ramesh P

అవకాశాలు ఇస్తామంటూ తనను లైంగికంగా వాడుకుని మోసం చేశారంటూ నటి శ్రీరెడ్డి టాలీవుడ్‌ ప్రముఖులపై ఆరోపణలు చేసి తీవ్ర ధుమారాన్ని రేపిన విషయం తెల్సిందే. కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఉద్యమం చేస్తాను అంటూ తెగ హడావుడి చేసిన ఈ అమ్మడు పవన్‌ కళ్యాణ్‌ని బూతులు తిట్టడంతో తీవ్ర విమర్శల పాలయింది. ఇటు ఇండస్ట్రీలో, అటు సోషల్‌ మీడియాలో కూడా అంతా శ్రీరెడ్డికి వ్యతిరేకంగా ఉండి సైడ్‌ చేశారు. దాంతో చేసేది లేక తమిళ సినీ పరిశ్రమకు చెక్కేసింది. అక్కడ కొన్ని చిన్న పాత్రల్లో నటించడానికి ఎంపికయింది. వచ్చిన అవకాశాలను వాడుకుంటూ తన ప్రతిభతో మరిన్ని అవకాశాలను రాబట్టుకునే ప్రయత్నం చేయకుండా అక్కడ కూడా ఏదో చేయబోతుంది.

కోళీవుడ్‌లోని ప్రముఖులపై ఈ అమ్మడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది. ఇలా స్టార్‌డమ్‌ ఉన్నవారిపై ఆరోపణలు చేసి మరింత సంచలనం అవాలని భావిస్తున్న శ్రీరెడ్డి పరిస్థితి ఆ తర్వాత ఏంటో అని సందేహంగా మారింది. తమిళ నిర్మాతల మండలిలో కీలక భాద్యతలను నిర్వహిస్తున్న వ్యక్తిపై శ్రీరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. నీవు ఎంతమంది హీరోయిన్లను వాడుకున్నావు, ఎంత మంది ఆర్టిస్టులను లైంగికంగా వేధించి, డబ్బులు ఇస్తానంటూ కవర్‌ చేశావో ఆ వివరాలన్ని నా దగ్గర ఉన్నాయి. నీ సైజ్‌ తెలుసు, నీ కర్‌ తెలుసు, నీ చరిత్ర మొత్తం నా దగ్గర పక్కా ఆధారాలతో ఉంది, త్వరలోనే బయట పెడతాను అంటూ ఒక వ్యక్తినుద్దేశించి సంచలన ఆరోపణలు చేసింది.

Latest Sri Reddy Leaks On Tamil Star Hero-

చిన్న నిర్మాతలను తొక్కేస్తూ అందుకు అగ్ర నిర్మాతల దగ్గర ఎంత పుచ్చుకుంటున్నావో నాకు తెలుసు, నీ ఎమ్మెల్యే సీటు, నీ పదవి, నీ స్టార్‌ హీరో క్రేజ్‌ అంతా కూడా పోయే సమయం దగ్గర పడుతోంది. త్వరలోనే మీడియా ముందు, కోర్టు ముందు నీ చరిత్ర అంతా బహిరంగ పర్చుతాను అంటూ తమిళ స్టార్‌ హీరోపై బాంబు వేసింది. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని కాలం గడపక ఈమెకు ఇంత రచ్చ అవసరమా? ఈ వ్యాఖ్యలకు గాను తమిళ పరిశ్రమలో ఉన్న అవకాశాలు కూడా పోతే పరిస్థితి ఏంటి అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.