బాలయ్య ఇంటిని కూల్చేస్తున్నారా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణకు సంబందించిన ఇంటిపై పలు పుకార్లు వినిపిస్తున్నాయి.ఆయనకి సంబందించిన ఈ ఇల్లు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది.

 Latest Newsabout Nandamuri Balakrishna-TeluguStop.com

అయితే ఇంతకీ విషయం ఏంటంటే బాలయ్య కు సంబందించిన ఈ ఇంటి ప్రక్కన రోడ్డు విస్తరణ చేపట్టనున్నారు.అయితే ఇందుకుగానూ బాలయ్యబాబు తన ఇంటికి సంబందించిన కొంత స్థలాన్ని రోడ్డు విస్తరణకు ఇవ్వాల్సి ఉంటుంది.

దీంతో బాలయ్య బాబు కూడా రోడ్డు విస్తరణకి కావాల్సిన స్థలాన్నిఇవ్వడానికి సిద్ద పడినట్లు సమాచారం.అంతే గాక మిగిలిన భాగాన్ని కూడా పడగొట్టి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇవ్వాలనుకుంటున్నట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు.

Telugu Hindupurmla, Hyderabad, Latestnandamuri, Rularnandamuri-Latest News - Tel

అయితే ఇప్పటికే బాలయ్య బాబుకు ఈ ఇల్లు కలిసి రాకపోవడంతో పలు మార్లు వాస్తులో మార్పులు చేర్పులు కూడా చేశారు.అయినా కూడా కలిసి రాకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెసులుస్తోంది.అయితే ఇది ఇలా ఉండగా గతంలో కూడా బాలయ్య బాబు హైదరాబాదులోని తనకు సంబందించిన ఓ ఖరీదైన ఇంటిని అమ్మేసి అమరావతిలో ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్నారని వదంతులు వచ్చిన విషయం తెలిసిందే. 

అయితే బాలయ్య బాబు ప్రస్తుతం రూలర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో బాలయ్యకి సరసన సోనాల్ చౌహన్, వేదికలు నటిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ విడుదలయ్యి మంచి ప్రేక్షక ఆదరణ పొందింది.

అయితే ఈ చిత్రాన్ని ఈ నెల 20వ తారీఖున విడుదల చేయనున్నట్లు సమాచారం. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube